CM Revanth Reddy: KCRకు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు ఇస్తారా
కేసీఆర్‌ను తెలంగాణ జాతిపితగా కొందరు పేర్కొనడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నోటీసులు ఇస్తే జాతిపితకు ఇస్తారా అని గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరామ్‌కు జరిగిన అవమానాన్ని గుర్తుచేస్తూ, చేసిన తప్పులకు నోటీసులు అందిస్తే జాతిపిత విధానం అంటారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను “తెలంగాణ జాతిపిత” అని కొందరు అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేస్తే, అది జాతిపితకు లేదా ఉద్యమకారుడికి అవమానం అవుతుందా అని వారు గగ్గోలు పెడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరామ్‌ను రేవంత్ రెడ్డి ఉదహరించారు. ఆర్.ఎస్.యు నుంచి ఆర్.ఎస్.ఎస్ వరకు, కమ్యూనిస్టుల నుంచి కాంగ్రెస్ వరకు ఏకం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన కోదండరామ్ ఉద్యమకారుడు కాదా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అలాంటి ఉద్యమకారుడైన కోదండరామ్ ఇంటి తలుపులు బద్దలు కొట్టించి, పోలీసులు ఈడ్చుకుపోయారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అప్పుడు జరిగిన అవమానాన్ని కేసీఆర్ మరిచిపోయారా అని నిలదీశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
CM రేవంత్ కు ధన్యవాదాలు.. చిట్ చాట్ లో KTR
మద్యం మత్తులో అర్ధనగ్నంగా..కానిస్టేబుల్ వీరంగం..
అరకు చలి ఫెస్ట్‌లో ఆడిపాడిన అధికారులు
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

