హైదరాబాద్ కాల్పులపై సీపీ సజ్జనార్ కీలక వివరాలు
హైదరాబాద్‌లో జరిగిన కాల్పుల ఘటనను సీపీ సజ్జనార్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. హత్యాయత్నం, రాబరీ కేసులు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రజల భద్రతే తమ ప్రధాన కర్తవ్యమని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీపీ హామీ ఇచ్చారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేసి, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచారు.
హైదరాబాద్ నగరంలో జరిగిన కాల్పుల ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ఈ కేసులో హత్యాయత్నం, రాబరీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 109, 309 ప్రకారం కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా దర్యాప్తు చేపట్టినట్లు స్పష్టం చేశారు. కాల్పుల అనంతరం నిందితులు చాదర్‌ఘాట్ మీదుగా నింబోలిఅడ్డ–కాచిగూడ వైపు వెళ్లి, అక్కడ బట్టలు మార్చుకుని కాలినడకన కాచిగూడ క్రాస్ రోడ్ వరకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా గుర్తించినట్లు వివరించారు. ఘటనకు సంబంధించి అనేక సీసీటీవీ దృశ్యాలను సేకరించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, టెక్నికల్ ఆధారాలను కూడా విశ్లేషిస్తున్నామని చెప్పారు. ఇతర కమిషనరేట్లతో సమన్వయం చేసుకుంటూ నిందితుల కదలికలపై సమాచార సేకరణ కొనసాగుతోందని తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీపీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల భద్రతే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేసిన సజ్జన్నార్, ఘటనపై సమాచారం తెలిసిన వారు డయల్ 100కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసి, కీలక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు, చెక్‌పోస్టుల వద్ద వాహన తనిఖీలు, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచినట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సౌమ్య కుటుంబానికి ‘కోటి’ ఎక్స్‌గ్రేషియా
Nirmala Sitharaman: ఇక జిల్లాకో బాలికల హాస్టల్..
మెగా వారసుడు పుట్టిన వేళ.. బాక్సాఫీస్ వార్‌కు రెడీ అవుతున్న చిరు-బాలయ్య
సెంచరీలు కొట్టే వయసు.. 94 ఏళ్లకు కొత్త సినిమా ప్రకటన
Chiranjeevi: మెగా సెంటిమెంట్‌తో కొడుతున్న చిరంజీవి.. మరో హిట్ పక్కాన ?
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

