AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Thanuja: గుండెల నిండా బాధ.. భరించలేకున్నా.. బిగ్ బాస్ తనూజ ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రన్నరప్ గా నిలిచింది కన్నడ బ్యూటీ తనూజ పుట్టస్వామి. ఓ దశలో విజేతగా నిలుస్తుందనుకున్న ఆమె అనూహ్యంగా రన్నరప్ తో సరిపెట్టుకుంది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట పెద్దగా కనిపించట్లేదీ అందాల తార.

Bigg Boss Thanuja: గుండెల నిండా బాధ.. భరించలేకున్నా.. బిగ్ బాస్ తనూజ ఎమోషనల్.. ఏం జరిగిందంటే?
Bigg Boss Thanuja
Basha Shek
|

Updated on: Feb 02, 2026 | 9:33 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి దాదాపు నెల రోజులు పైనే అవుతోంది. అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో తీవ్రమైన నెగెటివిటీని ఎదుర్కొంటోంది తనూజ. ముఖ్యంగా ఓ వర్గం నెటిజన్లు తనూజను టార్గెట్ చేసి విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఈ విషయంపై ఓపెన్ అయ్యిందీ ముద్దుగుమ్మ. అనవసరపు ట్రోలింగ్‌ వల్ల తాను మానసిక వేదన అనుభవిస్తున్నానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది తనూజ.. ‘చాలాకాలంగా నా మనసులో తిరుగుతున్నదంతా మీతో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నన్ను నిందించడం ఆపండి. మీ అందరిలాగే నాకూ ఒక లైఫ్ ఉంది. నా పనేదో నేను చేసుకుంటున్నాను. నా బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఎవరి జీవితాల్లో వారందరూ బిజీ అయిపోయాం. ప్రతిదానికి పీఆర్‌(డబ్బులు పెట్టి ఒక టీమ్‌ నడపడం) అనడం మానేయండి. నాకు పీఆర్‌ టీమ్‌ అంటూ ఏదీ లేదు. నా సోషల్‌ మీడియా అకౌంట్స్‌ చూసుకోవడానికి మాత్రం ఒక వ్యక్తి ఉన్నారంతే! ఈరోజుకూ నాపైన సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన నెగెటివిటీ వస్తోంది. ప్రతిరోజు అసభ్యకరంగా దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నేను వేరొకరిని టార్గెట్‌ చేశానని, వారిని చెడుగా చిత్రీకరించాలని చూస్తున్నానని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవతలివారిపై మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను. కానీ, నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానో మీకు తెలుసా? నేనెంత నరకం అనుభవిస్తున్నానో మీకు తెలుసా? ప్రతి రోజు చెండాలమైన మాటలంటున్నారు. నా క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. లేని పోని నిందలేసి అవమానిస్తున్నారు. నా క్యారెక్టర్‌ను తప్పు పడుతుంటే ఒక మహిళగా భరించలేకపోతున్నాను.

నోటికొచ్చిన మాటలనడం మీకు చిన్న విషయమేమో! నన్ను మాత్రం మానసికంగా ఎంతో కుంగదీస్తున్నాయి. మనసుకు మానని గాయాలు చేస్తున్నాయి. ఈ బాధనంతా భరిస్తున్నాను. ఎవరితో పంచుకోలేక మౌనాన్ని ఆశ్రయించాను. మీలాగే నాకూ ఓ కుటుంబం ఉందిగా. మీరు నా గురించి వాగే చెత్తవాగుడు, చెత్త కామెంట్స్‌ నా కుటుంబసభ్యులు కూడా చదువుతారు. అప్పుడు వాళ్లెంత బాధపడతారు? అసభ్య కామెంట్లు పెట్టే ఫేక్‌ అకౌంట్స్‌ ఎక్కడినుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదు. నేనే కాదు, నాకు సపోర్ట్‌గా నిలబడ్డవారిని కూడా ద్వేషిస్తున్నారు. ఒకర్ని మానసికంగా హింసిస్తే ఏమొస్తుంది? ఒకరిపై విషం చిమ్మితే ప్రశాంతంగా ఉండొచ్చనుకుంటున్నారా? ఇక్కడ నేనెవరనీ టార్గెట్ చేయడం లేదు. అలాగే డ్రామా క్రియేట్‌ చేయాలని అసలే అనుకోవట్లేదు. నా పని నేను చేసుకుంటూ ప్రశాంతంగా, గౌరవంగా జీవించాలనుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది తనూజ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి దీనితోనైనా ఆమెపై ట్రోలింగ్ తగ్గుతుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ తనూజ లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్