Ram Charan Upasana : రామ్ చరణ్, ఉపాసన పెళ్లిరోజు.. అభిమానులకు క్యూట్ సర్ ప్రైజ్ ఇచ్చిన మెగా కోడలు..
ఇటీవలే పెద్ది సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్. డైరెక్టర్ బుచ్చి బాబు సన దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈరోజు జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్లి రోజు సందర్భంగా అభిమానులకు క్యూట్ సర్ ప్రైజ్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి తెలిసిందే. ఇక ఆయన సతీమణి ఉపాసన కొణిదెలకు సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. ఓవైపు ఫ్యామిలీ బాధ్యతలు చూసుకుంటూనే అటు వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఏదోక పోస్ట్ చేస్తుంటారు. తాజాగా ఈ జంట తమ వైవాహిక బంధంలో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నారు. జూన్ 14న రామ్ చరణ్, ఉపాసన పెళ్లి రోజు. ఈ సందర్భంగా మెగా అభిమానులకు ఉపాసన ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు ఉపాసన. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న ఒక క్యూట్ ఫొటో ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ పిక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇంతకీ ఉపాసన ఏం చేశారో తెలుసా.. ?
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు
సాధారణంగానే రామ్ చరణ్, ఉపాసనలకు సంబంధించిన ఏ అప్‌డేట్ అయినా సోషల్ మీడియాలో నిమిషాల్లో ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023 జూన్ 20న కూతురు పుట్టగా.. క్లీంకార అని నామకరణం చేశారు. ఇక ఈ ఏడాది జనవరి 31న వీరికి పాప, బాబు కవలలు జన్మించారు. పాపకు అన్వీరా దేవి, బాబుకు శివరామ్ అని పేరు పెట్టారు. అయితే తమ పిల్లలకు సంబంధించిన ఫోటోస్ బయటకు రాకుండా చూసుకున్నారు ఉపాసన, చరణ్ దంపతులు. ఇప్పుడు పెళ్లిరోజు సందర్భంగా మొదటి సారి తన కవల పిల్లలకు సంబంధించిన ఫోటో రివీల్ చేశారు ఉపాన.
ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‌కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
తన పిల్లల చేతులతోపాటు తన చేతి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ మనసు నిండిపోయింది అని రాసుకొచ్చింది. ఫొటోను షేర్ చేస్తూ ఉపాసన జోడించిన క్యాప్షన్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తోంది. తమ జీవితంలోకి పిల్లలు తెచ్చిన ఆనందాన్ని, ఈ వెడ్డింగ్ యానివర్సరీ తమకు ఎంత ప్రత్యేకమైనదో ఆమె అందులో పేర్కొన్నారు. ఈ ఫొటో చూసిన మెగా అభిమానులు, సినీ ప్రముఖులు రామ్ చరణ్-ఉపాసన జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. “హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చరణ్ అన్న, ఉపాసన వదిన” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు
ఉపాసన పోస్ట్..
View this post on Instagram
ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‌కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
