ప్రియుడితో పెళ్లి క్యాన్సిల్.. ఫస్ట్ టైమ్ స్పందించిన నివేదా పేతురాజ్
Rajitha Chanti
Pic credit - Instagram
14 June 2026
టాలీవుడ్ చందమామ నివేదా పేతురాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనదైన నటన, అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
సింగ్ గీతం చిత్ర విజయోత్సవ వేడుకలో కథానాయిక నివేదా పేతురాజ్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సినిమాను వదిలేయాలనుకున్నట్లు తెలిపింది.
నివేదా పేతురాజ్ మాట్లాడుతూ, "2023లో నేను సినిమాకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నాను. కానీ జీవితం సరైన మార్గంలో కాకుండా, కొన్నిసార్లు తప్పు దారిలో నడిపించి,
చివరికి సింగ్ గీతం వంటి శ్రీనివాసరావు గారి గోల్డెన్ బ్లాక్‌బస్టర్‌లో నన్ను నిలబెట్టిందని గ్రహించాను" అని అన్నారు. తనను తిరిగి సినీ రంగంలోకి తీసుకువచ్చి,
జీవితాన్ని ప్రసాదించినందుకు నాగ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నాగ్ గారు లేకుంటే నేను ఇక్కడ ఉండేదానిని కాదు. బహుశా హిమాలయాలలోనో,
మరెక్కడో ధ్యానం చేసుకుంటూ ఉండేదానిని. నేను వేరే జీవితాన్ని ఎంచుకోవాలనుకున్నాను, కానీ మళ్ళీ తిరిగి వచ్చాను. గొప్ప విజయం సాధించాను అని నమ్ముతున్నాను
రెండు రోజుల క్రితం చిత్రాన్ని చూశానని, తన కళ్లలో నీళ్లు తిరిగాయని నివేదా వెల్లడించారు. "ఇది ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న వాస్తవికతను ప్రతిబింబిస్తుంది.
ఈ చిత్రం నుండి ఒక చిన్న సందేశం ఉంటుందని ఆశిస్తున్నాను. ఒక నవజాత శిశువు ఈ భూమిపైకి వచ్చినప్పుడు, మనం ప్రతి శిశువు కోసం ఒక మొక్కను నాటడానికి ప్రయత్నించాలి అన్నారు.