AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kingdom: మేడమ్.. మీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? కింగ్‌డమ్ బ్యూటీ భాగ్యశ్రీ గురించి ఈ విషయాలు తెలుసా?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న తాజా చిత్రం కింగ్ డమ్. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.

Kingdom: మేడమ్.. మీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? కింగ్‌డమ్ బ్యూటీ భాగ్యశ్రీ గురించి ఈ విషయాలు తెలుసా?
Kingdom Movie
Basha Shek
| Edited By: TV9 Telugu|

Updated on: Jul 28, 2025 | 1:18 PM

Share

ఈ ఏడాది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమాలో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ ఒకటి. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై విడుదలకు ముందే భారీ బజ్ నెలకొంది. ఇప్పటివరకు రిలీజైన టీజర్, పాటలు, ట్రైలర్ ప్రమోషన్లతో విజయ్ సినిమాకు మంచి హైప్ వచ్చింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో భారీ స్థాయిలో రూపొందిన ఈ సినిమా జులై 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్లు మరింత ఊపందుకున్నాయి. కాగా కింగ్ డమ్ సినిమాలో విజయ్ దేవరకొండతో భాగ్యశ్రీ బోర్సే రొమాన్స్ చేయనుంది. ఇప్పటివరకు రిలీజైన సినిమా స్టిల్స్, సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ లోనూ భాగ్యశ్రీ ఎంతో అందంగా, క్యూట్ గా కనిపించింది. సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందోనని సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో భాగ్యశ్రీ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తిచేసింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేసింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఉంది. అదేంటంటే.. ఈ సినిమాకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది భాగ్యశ్రీ. ఒక కొత్త హీరోయిన్‌ ఇంత త్వరగా డబ్బింగ్ చెప్పడంపై నెట్టింట భాగ్యశ్రీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో కింగ్ డమ్ సినిమాలో భాగ్యశ్రీ నటనతో పాటు ఆమె వాయిస్ వినడానికి ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

డబ్బింగ్ వర్క్ పూర్తి చేసిన భాగ్యశ్రీ బోర్సే..

కాగా నైజీరియాలోని లాగోస్ లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది. ఆపై ఇండియాకు తిరిగి తిరిగి వచ్చి   బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుని ఒక ఎజెన్సీతో కలసిపనిచేసింది. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ తో ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ చిత్రం యారియాన్ 2లో రాజ్యలక్ష్మి పాత్రలో తన నటనతో యువతను ఆకట్టుకుంది. అలాగే కార్తీక్ ఆర్యన్ తో కలిసి చందు ఛాంపియన్ లోనూ నటించింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ తో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది.

అట్టహాసంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి