Ram Charan: ఇది కదా దేశభక్తి అంటే.. ఆస్కార్ సంబరాల్లో రామ్ చరణ్ సూట్‌ను గమనించారా?
టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించినా .. కంటిన్యూ సినిమాలతో బిజీగా ఉన్నా.. ఇండియన్ ఆర్మీని మాత్రం అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఏదైనా అకేషన్లలో.. లేదా వారు ఆహ్వానించిన టైంలో..
ఓ హీరో ఎప్పుడు రియల్ హీరో అవుతారు! ఎల్లలు దాటినా తన దేశ భక్తిని చాటినప్పుడే కదా..! ప్రపంచ వేదికలపై తన దేశాన్ని గుర్తు చేసినప్పుడే కదా..! తన దేశాన్ని కాపు కాసే సైనికుల త్యాగాలను గుండెల్లో నింపుకున్నప్పుడే కదా..! అలా అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా.. రియల్ హీరోనే. టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించినా .. కంటిన్యూ సినిమాలతో బిజీగా ఉన్నా.. ఇండియన్ ఆర్మీని మాత్రం అప్పుడప్పుడూ కలుస్తూనే ఉంటారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఏదైనా అకేషన్లలో.. లేదా వారు ఆహ్వానించిన టైంలో.. కాదనకుండా.. ఆర్మీ గ్యాదరింగ్స్‌లలో పార్టిసిపేట్ చేస్తుంటారు. వారితో మాట్లాడి.. కలిసి భోంచేసి హంగామా చేస్తుంటారు. వారిలో జోష్ నింపుతుంటారు. వారి అనుభవాలను కష్టసుఖాలను గుండెల్లో దాచుకుని వీలైనంత సాయం చేస్తుంటారు. అలాంటి రామ్ చరణ్ ..తాజాగా జరిగిన ఆస్కార్ అవార్డ్ సెర్మనీలో ఇండియన్ ఆర్మీ బొమ్మను తన గుండెపై పెట్టుకున్నారు. ఇండియన్ ఆర్మీని.. ఆస్కార్ లాంటి వేదికపై రిప్రజెంట్ చేశారు. తన దేశ భక్తిని మరో సారి చాటారు.
ఎస్ ! చెర్రీకి పాస్ట్ టూ ఇయర్స్ నుంచి డిజైనర్ గా పనిచేస్తున్న నిఖితా సింఘానియా అండ్ శాంతను.. రామ్ చరణ్ కోరిక మేరకు ఆస్కార్ కోసం ఓ స్పెషల్ సూట్‌ను డిజైన్ చేశారు. ఇక ఈ సూట్ లెఫ్ట్ సైడ్ ఆర్మీ సంబంధించిన లోగోను ప్లేస్ చేశారు. దాంతో పాటే.. ఆ సూట్ బటన్స్ పై.. అశోక చక్రాన్ని.. ఇండియన్ లోగోను ప్లేస్ చేశారు. ఇలా రామ్ చరణ్ ఇండియాను.. ఇండియన్ సోల్జర్స్‌ను ఆస్కార్ రెడ్ కార్పెట్ పై రిప్రజెంట్ చేశారు. తన దేశ భక్తిని మరో సారి చాటారు. చరణ్ దేశ భక్తికి సలాం అనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..