AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grammys Awards: అట్టహాసంగా గ్రామీ అవార్డ్స్ వేడుక.. భారత సంతతికి చెందిన గాయనికి అవార్డ్..

ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల ప్రధానోత్సం అట్టహాసంగా జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ వేదికగా జరిగిన ఈ వేడుకలో పేరుపొందిన సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ పాల్గొన్నారు. ఈ వేడుకలలో ఇండో అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ గ్రామీ అవార్డ్ అందుకున్నారు.

Grammys Awards: అట్టహాసంగా గ్రామీ అవార్డ్స్ వేడుక.. భారత సంతతికి చెందిన గాయనికి అవార్డ్..
Chandrika Tandon
Rajitha Chanti
|

Updated on: Feb 03, 2025 | 1:07 PM

Share

సినీసంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాలు 67 గ్రామీ అవార్డ్స్ వేడుక ఫిబ్రవరి 3న అట్టహాసంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత దర్శకులు, గాయనీగాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో భారతీయ సంతతికి చెందిన సంగీత విద్వాంసురాలు చంద్రికా టాండన్ గ్రామీ అవార్డ్ అందుకున్నారు. ‘త్రివేణి’ బెస్ట్‌ న్యూ ఏజ్‌ యాంబియంట్ ఆర్‌ చాంట్ ఆల్బమ్‌గానూ ఆమెకు ఈ పురస్కారం లభించింది. దీంతో ఈ సందర్భంగా చంద్రికా టాండన్ స్పందిస్తూ తనకు చాలా సంతోషంగా ఉందని.. ఈ అవార్డ్ తనకు ప్రత్యేకమన్నారు. ప్రస్తుతం చంద్రిక టాండన్ వయసు 71 సంవత్సరాలు. ఆమె రూపొందించిన త్రివేణి ఆల్బమ్‌లో ఏడు పాటలు ఉన్నాయి. వీటిని ఆమె ధ్యానం, మనశ్శాంతి కోసం కంపోజ్ చేసినట్లు తెలిపారు.

ఈ ఆల్బమ్‌లో దక్షిణాఫ్రికా ఫ్లూటిస్ట్ వాటర్ కెల్లర్‌మాన్, జపనీస్ సెల్లిస్ట్ ఎరు మాట్సుమోటోతో కలిసి చంద్రికా టాండన్ వేద మంత్రాలను పఠించారు. మూడు నదుల సంగమానికి సంబంధించి ఈ ఆల్బమ్‌కు ‘త్రివేణి’ అని పేరు పెట్టారు. అదేవిధంగా, ఇందులో మూడు విభిన్న శైలీలో ఆలపించారు. “సంగీతం ప్రేమ, సంగీతం మనందరిలో వెలుగులు నింపుతుంది. సంగీతం మన జీవితంలోని చీకటి సమయంలో కూడా ఆనందం, నవ్వును పంచుతుంది” అంటూ తన భావాలను ఈ పాటలలో తెలియజేశారు చంద్రికా టాండన్.

చంద్రిక చెన్నైలోని సంప్రదాయ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. చంద్రికా కృష్ణమూర్తి టాండన్, ఆమె చెల్లెలు ఇంద్ర చిన్నప్పటి నుండి సంగీత శిక్షణ తీసుకున్నారు. చంద్రిక తన కుటుంబం నుండి సామవేద బోధనలు తీసుకుంది. కర్ణాటక సంగీతంతో పాటు వేద మంత్రాలు కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. చంద్రికా టాండన్ మెకిన్సేలో మొదటి భారతీయ-అమెరికన్ మహిళా భాగస్వామి. ఐఐఎం అహ్మదాబాద్‌లో గ్రాడ్యుయేట్ అయిన చంద్రిక గ్లోబల్ బిజినెస్ లీడర్‌గా మారింది. 2015లో, ఆమె తన భర్త రంజన్‌తో కలిసి న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు $100 మిలియన్లు విరాళంగా ఇచ్చింది. ఇప్పుడు ఆ సంస్థ అతని పేరుకు టాండన్ పేరును చేర్చింది.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన