Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddu Jonnalagadda: ఓటీటీలోకి వచ్చిన తర్వాత థియేటర్స్ లోకి సిద్దు సినిమా.. అదికూడా ఐదేళ్ల తర్వాత

‘డీజే టిల్లు’ సినిమాతో భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ప్రత్యేకంగా యూత్ మంచి క్రేుజ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ తో తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు. అంతకు ముందు సిద్దు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే హీరోగానూ కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు.

Siddu Jonnalagadda: ఓటీటీలోకి వచ్చిన తర్వాత థియేటర్స్ లోకి సిద్దు సినిమా.. అదికూడా ఐదేళ్ల తర్వాత
Siddu Jonnalagadda
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 03, 2025 | 1:53 PM

స్టార్ బాయ్ సిద్దూజొన్నల గడ్డ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి ఆయా షూటింగ్స్ తో జోరుమీదున్నాడు. సిద్దు నటించిన డీజే టిల్లు , టిల్లు స్క్వేర్ సినిమాలు భారీ హిట్స్ గా నిలిచాయి. దాంతో సిద్దు పేరు మారుమ్రోగింది. అంతే కాదు యూత్ లో సిద్దు క్రేజ్ విపరీతంగా పెరిగింది. సిద్దు త్వరలోనే జాక్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బేబీ బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే డీజే టిల్లు సినిమా కంటే ముందు సిద్దు కొన్ని సినిమాలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. అలాగే హీరోగానూ కొన్ని సినిమాలు చేశాడు. కానీ ఆ సినిమాలు ఈ యంగ్ హీరోకి అంతగా గుర్తింపు తీసుకురాలేదు.

లైఫ్ బిఫోర్ వెడ్డింగ్ అనే సినిమాతో సిద్దు హీరోగా పరిచయం అయ్యాడు. బాయ్ మీట్స్ గర్ల్, గుంటూర్ టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాధ వినుమా వంటి సినిమాల్లో నటించాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాల్లో ఓ సినిమా రీ రిలీజ్ కు  రెడీ అవుతుంది. సినిమాఓటీటీలోకి వచ్చిన ఐదేళ్ల తర్వాత థియేటర్స్ లో పలకరించడానికి వస్తుంది. ఆ సినిమానే కృష్ణ అండ్ హిజ్ లీలా. ఈ సినిమా ఆసక్తికర కథతో తెరకెక్కింది.

ఈ చిత్రాన్ని రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించగా సురేశ్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్, షాలిని వడ్నికట్టి, సీరత్ కపూర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కింది. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించాడు. కాగా ఈ సినిమా కరోనా కార‌ణంగా లాక్ డౌన్ ప్ర‌కటించ‌డంతో ‘ఆహా’ ఓటీటీ‌లో 2020, జూలై 4న డైరెక్ట్ గా విడులైంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇట్స్‌ కాంప్లికేటెడ్‌ అనే పేరుతో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.  ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం పురస్కరించుకొని ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆ రోజు ధోని ఏం చేశాడో.. అసలు కథను చెప్పేసిన సర్ఫరాజ్
ఆ రోజు ధోని ఏం చేశాడో.. అసలు కథను చెప్పేసిన సర్ఫరాజ్
ఒక్క సినిమాతో హీరోలకు వెనక్కు నెట్టింట హీరోయిన్..
ఒక్క సినిమాతో హీరోలకు వెనక్కు నెట్టింట హీరోయిన్..
మీకూ కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం సమస్యలు ఉన్నాయా?
మీకూ కీళ్ల నొప్పులు, జుట్టు రాలడం సమస్యలు ఉన్నాయా?
అయ్యబాబోయ్..నాగార్జున అసలు పేరు ఇది కాదా..షాకింగ్ సీక్రెట్ రివీల్
అయ్యబాబోయ్..నాగార్జున అసలు పేరు ఇది కాదా..షాకింగ్ సీక్రెట్ రివీల్
ఇంత సింపుల్ లుక్‌లో అంత అందంగా ఎలా ఉన్నావు భాను..క్యూట్ ఫొటోస్
ఇంత సింపుల్ లుక్‌లో అంత అందంగా ఎలా ఉన్నావు భాను..క్యూట్ ఫొటోస్
పాకిస్థాన్‌ దిగజారినా.. హుందాగా బదులిచ్చిన టీమిండియా!
పాకిస్థాన్‌ దిగజారినా.. హుందాగా బదులిచ్చిన టీమిండియా!
తల్లిగా నటించిన హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..చివరకు
తల్లిగా నటించిన హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న స్టార్ హీరో..చివరకు
సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్
సాయి పల్లవికి క్రేజీ అనుభవం.. అందరి ముందే ముద్దు పెట్టిన ఫ్యాన్
రూ.100 కోట్లు దాటేసిన తండేల్.. కాలర్ ఎగరేసిన హీరో
రూ.100 కోట్లు దాటేసిన తండేల్.. కాలర్ ఎగరేసిన హీరో
కాసులు కురిపించే స్కీమ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటీశ్వరులే..
కాసులు కురిపించే స్కీమ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటీశ్వరులే..