Tollywood : డ్రగ్ పెడ్లర్‌, నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య..

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసు సంచలనంగా మారింది. కబాలి చిత్ర నిర్మాత కెపి చౌదరి అలియాస్ కృష్ణ ప్రసాద్ చౌదరి 100 గ్రాముల కొకైన్‌తో పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడం కలకలం సృష్టించింది. పోలీసుల రిపోర్టులో మొత్తం 12 మందికి డ్రగ్స్‌ అమ్మినట్లు కేపీ చౌదరి దర్యాప్తులో అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఆతర్వాత ఆయనను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

Tollywood : డ్రగ్ పెడ్లర్‌, నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య..
Kp Chowdary
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 03, 2025 | 2:09 PM

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు కేపీ చౌదరి. ఇక ఇప్పుడు గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికే చాలా సందర్భాల్లో డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చింది. అంతే కాదు పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇక గతంలో ప్రొడ్యూసర్‌ కేపీ చౌదరి అరెస్ట్ అవ్వడం ఇండస్ట్రీని షేక్ చేసింది.

గత ఏడాది జూన్ లో కబాలి మూవీ ప్రొడ్యూసర్‌ కేపీ చౌదరి అరెస్ట్‌ కావడంతో.. సినీ సెలబ్రిటీల గుండెల్లో గుబులు మొదలైంది.  చౌదరి నుంచి 4మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాల్‌డేటా, వాట్సప్ చాట్‌లను విశ్లేషించారు. చౌదరికి సంబంధించిన సెల్‌ఫోన్ డేటాతో పాటు గతంలో అరెస్ట్‌ వారి డేటాను వెరిఫై  చేశారు.

కాల్‌ డేటా, వాట్సప్ చాట్‌లో ఇండస్ట్రీకి సంబంధించిన వారి పేర్లతో ఓ లిస్ట్‌ను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎవరి పేర్లు తెరపైకి వస్తాయన్నది అప్పుడు ఉత్కంఠగా మారింది.. 2023 జూన్‌ 14న డ్రగ్స్‌ కేసులో కేపీ చౌదరి పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ కింగ్‌ పిన్‌, నైజీరియాకు చెందిన డ్రగ్స్‌ పెడ్లర్‌ రాకేష్‌ రోషన్‌తో కేపీ చౌదరికి ఉన్న సంబంధాలపై పోలీసులు అప్పట్లో ఆరాతీశారు. ఇక ఇప్పుడు ఆయన గోవాలో ఆత్మహత్య చేసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అన్ని ఇందులోనే.. సరికొత్త రైల్వే యాప్
ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అన్ని ఇందులోనే.. సరికొత్త రైల్వే యాప్
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా సినిమా అవార్డులు
తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఏటా సినిమా అవార్డులు
సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ఆలోచనలో మార్పు.. టికెట్ రేట్లు తగ్గేనా
సంక్రాంతి తర్వాత ఇండస్ట్రీ ఆలోచనలో మార్పు.. టికెట్ రేట్లు తగ్గేనా
అడవి సమీపాన పోలీసుల తనిఖీలు.. ఓ కారులో కనిపించింది చూడగా..
అడవి సమీపాన పోలీసుల తనిఖీలు.. ఓ కారులో కనిపించింది చూడగా..
అద్భుతమైన సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..
అద్భుతమైన సస్పెన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..
ఫిబ్రవరి 12న మెగా జాబ్‌మేళా.. ఎక్కడంటే?
ఫిబ్రవరి 12న మెగా జాబ్‌మేళా.. ఎక్కడంటే?
పుష్ప 2 మంత్స్ సెలబ్రేషన్స్‎.. అప్పుడే బన్నీ నెక్స్ట్ మూవీ..
పుష్ప 2 మంత్స్ సెలబ్రేషన్స్‎.. అప్పుడే బన్నీ నెక్స్ట్ మూవీ..
తండ్రి ఎమ్మెల్యే.. కూతురు హీరోయిన్.. బోల్డ్ సీన్లకు కేరాఫ్ అడ్రస్
తండ్రి ఎమ్మెల్యే.. కూతురు హీరోయిన్.. బోల్డ్ సీన్లకు కేరాఫ్ అడ్రస్
సామాజిక న్యాయం కోసం కులగణన చేయాల్సిందేః విజయ్
సామాజిక న్యాయం కోసం కులగణన చేయాల్సిందేః విజయ్
అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు.. ధరలు 5 లక్షల నుండి ప్రారంభం
అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు.. ధరలు 5 లక్షల నుండి ప్రారంభం