Ileana D’Cruz: మరోసారి ప్రేమలో పడిన ఇలియానా.. స్టార్‌ హీరోయిన్‌ సోదరుడితో ఫొటోలు వైరల్‌..

Ileana D'Cruz: దేవదాస్‌ సినిమాతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీని తనవైపునకు తిప్పుకుంది గోవా బ్యూటీ ఇలియానా. ఆతర్వాత పోకిరి, కిక్‌, జల్సా, జులాయి తదితర హిట్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. బర్ఫీ సినిమాతో..

Ileana D'Cruz: మరోసారి ప్రేమలో పడిన ఇలియానా.. స్టార్‌ హీరోయిన్‌ సోదరుడితో ఫొటోలు వైరల్‌..
Ileana D'cruz
Follow us
Basha Shek

|

Updated on: Jul 17, 2022 | 6:10 PM

Ileana D’Cruz: దేవదాస్‌ సినిమాతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీని తనవైపునకు తిప్పుకుంది గోవా బ్యూటీ ఇలియానా. ఆతర్వాత పోకిరి, కిక్‌, జల్సా, జులాయి తదితర హిట్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. బర్ఫీ సినిమాతో అటు బాలీవుడ్‌లోనూ హిట్‌ కొట్టింది. ఇలా తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్‌ భాషల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపిస్తోంది. అంతకంటే ఎక్కువగా తన సోషల్‌ మీడియా ద్వారా వార్తల్లో నిలుస్తోంది. నిత్యం తన గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటోంది. కాగా ఈ గోవా ముద్దుగుమ్మ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ (Katrina Kaif) సోదరుడు సెబాస్టియన్‌తో ఈ సొగసరి డేటింగ్‌లో ఉందని బాలీవుడ్‌ మీడియా కోడైకూస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official)

కాగా ఇటీవలే కత్రినా.. తన పుట్టినరోజు వేడుకల కోసం భర్త విక్కీ, సోదరుడు సెబాస్టియన్‌, ఇతర కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఇలియానా సైతం ఈ సెలబ్రేషన్స్ లో భాగమైంది. సెబాస్టియన్‌తో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కత్రినా, ఇలియానా ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘సూర్యోదయం, కాక్ టెయిల్స్, కొంచెం బర్త్ డే కేక్’ అని ఈ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది ఇలియానా. ఈ ఫొటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగానే కత్రినా సోదరుడితో ఇలియానా డేటింగ్ చేస్తుందని పుకార్లు షికార్లు కొట్టడం ప్రారంభమయ్యాయి. ఎలాంటి సంబంధం లేకుండా ఇలియానా ఈ వేడుకల్లో ఎందుకు పాల్గొ్ంటోంది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు సెబాస్టియన్‌ ఇన్‌స్టా ఖాతాని ఇలియానా గత కొంతకాలంగా ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉంటే డేటింగ్‌ వ్యవహారాలతో వార్తల్లో నిలవడం ఇలియానకు ఇదేమీ మొదటిసారి కాదు. ఆమె గతంలో ఆండ్రూ అనే ఓ విదేశీ ఫొటోగ్రాఫర్‌తో పడింది. పెళ్లిదాకా కూడా వచ్చారు. అయితే వ్యక్తిగత కారణాలతో 2019లో విడిపోయారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..