Actress Indraja: ఇంద్రజ ప్రేమ వివాహానికి ఎంత మంది వచ్చారో తెలుసా? ఖర్చు గురించి తెలిస్తే షాకవుతారు..

ఒకప్పుడు తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ టాప్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది ఇంద్రజ( Indraja). అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె తెలుగులో టాప్‌ హీరోలందరి సరసన నటించిమెప్పించింది. ఆ తర్వాత పెళ్లి

Actress Indraja: ఇంద్రజ ప్రేమ వివాహానికి ఎంత మంది వచ్చారో తెలుసా? ఖర్చు గురించి తెలిస్తే షాకవుతారు..
Actress Indraja
Follow us
Basha Shek

|

Updated on: Jul 16, 2022 | 3:10 PM

ఒకప్పుడు తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ టాప్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంది ఇంద్రజ( Indraja). అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె తెలుగులో టాప్‌ హీరోలందరి సరసన నటించిమెప్పించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొన్ని రోజుల పాటు సినిమా ఇండస్ట్రీకి  దూరమైంది. మళ్లీ ఇప్పుడు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తోంది. అలాగే కొన్ని టీవీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే సినిమాల పరంగా ఇంద్రజ గురించి అందరికీ తెలిసినా, ఆమె వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియదు. అయితే తాజాగా జరిగిన ఓ టీవీ షోలో తన పర్సనల్‌ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిందీ అందాల తార.

ఈ సందర్భంగా తన వివాహం గురించి మాట్లాడిన ఇంద్రజ..’ మాది ప్రేమ వివాహమే. మా పెళ్లికి కేవలం 13 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. మా పెళ్లికి అయిన ఖర్చు అక్షరాలా రూ.7500 మాత్రమే’ అని చెప్పుకొచ్చింది. సాధారణంగా సెలబ్రిటీల వివాహాలంటే హంగు, ఆర్భాటాలు ఉంటాయి. అలాంటిది ఒక టాప్‌ హీరోయిన్‌ పెళ్లికి కేవలం 13 మంది అతిథులు రావడం, తక్కువ ఖర్చుతో పెళ్లి జరిగిపోవడం నిజంగా ఆశ్చర్యకర విషయమే. కాగా ఇంద్రజ భర్త పేరు మహ్మద్ అబ్సర్. అతను ఓ ముస్లిం అబ్బాయి. 2006లో వీరి వివాహమైంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరి మధ్య స్నేహం చిగురించి.. ఆతర్వాత ప్రేమగా మారింది. ఆపై ఇరు కుటుంబ సభ్యులు, పెద్దల ఆశీర్వాదంతో పెళ్లిపీటలెక్కారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..