- Telugu News Photo Gallery Cinema photos Upasana requests to mega fans please watch whole video Telugu Entertainment News
Upasana: ఓ మై గాడ్ మీకు అలా అర్థమైందా.. ప్లీజ్ నేను అలా అనలేదు.. పిల్లలపై ఉపాసన క్లారిటీ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన.. ఇటీవల నెట్టింట తెగ వైరల్ అయ్యారు. పిల్లలు పుట్టడం గురించి జగ్గీ వాసుదేవ్‌ను ఇటీవల ఓ ప్రశ్న అడిగిన ఉపాసన..
Updated on: Jul 17, 2022 | 6:12 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన.. ఇటీవల నెట్టింట తెగ వైరల్ అయ్యారు. పిల్లలు పుట్టడం గురించి జగ్గీ వాసుదేవ్‌ను ఇటీవల ఓ ప్రశ్న అడిగిన ఉపాసన...

ఆ ప్రశ్నతో తెలుగు టూ స్టేట్స్ లో హాట్ టాపిక్ గా మారారు. జనాబా నిమంత్రణలో భాగంగానే ఉపాసన పిల్లలు వద్దనుకుంటారా..?

అనే అనుమానాన్ని అటు సోషల్ మీడియాలోనూ.. ఇటు మెగా అభిమానుల్లోనూ కలిగించారు. అయితే ఇదే విషయం పై తాజాగా ఇన్‌స్టాలో క్లారిటీ ఇచ్చారు ఉపాసన.

తాను అలా అనలేదని చెప్పే ప్రయత్నం చేశారు. మరో సారి ఈ వీడియో పూర్తిగా చూడాలని... అలా అనుకునే వారికి సూచిస్తున్నారు ఉపాసన.

అసలు ఉపాసన ఆ వీడియోలో జగ్గీ వాసుదేవ్‌ను ఏం అడిగారు? అందుకు జగ్గీ ఏం సమాధానం చెప్పారు?

అంటే.. తాను తన భర్తతో కలిసి పదేళ్లుగా ఎంతో ఆనందంగా జీవితస్తున్నానని, అయినా ఎందుకని జనం తన 'ఆర్.ఆర్.ఆర్' అంటే.. "రిలేషన్ షిప్, ఎబిలిటీ టు రిప్రొడ్యూస్ , రోల్ ఇన్ లైఫ్.." గురించి చర్చించుకుంటున్నారని ఉపాసన సద్గురు జగ్గీని అడిగారు.

అందుకు సద్గురు జనాభా నియంత్రణ చేస్తే దేశానికి మంచిదని చెప్పారు. భవిష్యత్‌లో జనాభా పెరుగుతూ పోతే ఆర్థిక పరిస్థితులు తారుమారవుతాయనీ, పర్యావరణం కూడా దెబ్బతింటుందని సద్గురు అందులో అన్నారు.

అంతేకాదు.. జనాభా నియంత్రణ కోసం పిల్లలు వద్దనుకొనేవారిని అభినందించాల్సిందే అని అన్నారు. అంతే తప్ప ఆయన మాటలు విని ఉపాసన తాము పిల్లలు వద్దనుకుంటున్నామని ఎక్కడా చెప్పలేదు.

అయితే తాజాగా వీడియో చివరి వరకు చూడమని.. తాను అలా చెప్పలేదని.. ఉపాసన చేసిన పోస్ట్ తో.. అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయని అంటున్నారు మెగా ఫ్యాన్స్ అండ్ నెటిజెన్స్.





























