Allu Arjun : బాలయ్య సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలను చాలా ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సుకుమార్ తో పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ తన నెక్స్ట్

Allu Arjun : బాలయ్య సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అల్లు అర్జున్.. ఎందుకో తెలుసా..
Bunny
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 04, 2021 | 9:19 PM

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలను చాలా ఆచితూచి ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సుకుమార్‌తో పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్న బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద కూడా దృష్టి పెట్టాడు. ప్లాన్ బి, ప్లాన్ సి అంటూ స్కెచ్చులు వేసుకుంటున్నాడు. బాలయ్యకు బోయపాటి ఇవ్వబోయే హ్యాట్రిక్ హిట్ కోసం బన్నీ కాంపౌండ్‌ కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తోంది.  బాలయ్య హిట్టుతో బన్నీకి చాలా పనే పడింది. అఖండ సినిమా రిజల్ట్‌ని బట్టి… ఐకాన్ స్టార్ లైనప్‌లో మేజర్ ఛేంజెస్ జరగబోతున్నాయట. బన్నీ లిస్టులో బోయపాటి ఎన్నో నెంబరో తేలేది కూడా అక్కడేనట. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందనుకున్న బన్నీ-కొరటాల మూవీ… ఇన్‌డెఫినిట్‌గా వాయిదా పడింది. ఆచార్య తర్వాత కొరటాల ఎన్టీఆర్ క్యాంప్‌లో చేరిపోతున్నారు కనుక… బన్నీ కూడా… పుష్పరాజ్ గెటప్ తీసేసి.. శ్రీరామ్‌వేణుతో ఐకాన్ ప్రాజెక్ట్‌ షురూ చేస్తారు. ఆ వెంటనే పుష్ప2 కోసం మళ్లీ సుక్కూతో జాయినవుతారు ఐకాన్ స్టార్.

మొన్నామధ్య గీతాఆర్ట్స్ట్ ఆఫీస్‌లో కనిపించిన ప్రశాంత్ నీల్‌ కూడా బన్నీతో పవర్‌ప్యాక్డ్‌ మూవీకి రెడీ అన్నట్టు సైగ చేశారు. ఇవన్నీ కాకుండా… ఏఆర్ మురుగదాస్, బోయపాటి శ్రీనివాస్ కూడా బన్నీ కాల్షీట్స్‌తో రెడీగా వున్నారు. కానీ… ఇప్పుడు టేబుల్ మీదున్న స్ట్రాటజీ మొత్తాన్ని కాదనుకుని… ఓ సర్‌ప్రైజ్ ఇచ్చే ప్లాన్‌లో వున్నారు బన్నీ. అఖండ సినిమా రిలీజైతే… దానికి పాజిటివ్ రిజల్ట్ వస్తే… తద్వారా బోయపాటికి పూర్వ వైభవం కలిగితే… అల్లు అర్జున్ మనసు కూడా మారిపోయే ఛాన్సుంది. అందుకే.. ఐకాన్ కంటే ముందు గానీ… ఐకాన్ తర్వాత గానీ బోయపాటితో చేయికలిపే అవకాశం ఉంది. ఇదే… లేటెస్ట్‌గా టాలీవుడ్‌లో వినిపిస్తున్న బిగ్గెస్ట్ బజ్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nithiin: వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్న నితిన్.. నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తున్నాడో తెలుసా..

Liger Movie: తిరిగి పట్టాలెక్కిన పూరి సినిమా.. లైగర్ షూటింగ్ కోసం గోవా వెళ్లనున్న చిత్రయూనిట్..

Nabha Natesh: బంపర్ ఆఫర్ అందుకున్న ఇస్మార్ట్ బ్యూటీ.. సూపర్ స్టార్ సరసన నభా నటేశ్ ?

Sunitha Upadrashta: ఆ నమ్మకంతోనే నేను కూడా బతికేస్తున్నా.. ఎమోషనల్ అయిన సింగర్ సునీత

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!