Pushpa : అల్లు అర్జున్ పుష్ప రెండు పార్ట్‌లు కాదు మూడోది కూడా.. ఇదిగో క్లారిటీ..
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక మందన్న , డాలీ ధనంజయ్, ఫహద్ ఫాసిల్ తదితరులు నటించారు. ఇప్పుడు ఈ చిత్రం రెండవ భాగం 'పుష్ప: ది రూల్' అనే టైటిల్‌తో రెడీ అవుతుంది. పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప 3 కూడా వస్తుందని ఓ వార్త వైరల్ అవుతుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప: ది రైజ్’ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది. ప్రేక్షకులు ఈ సినిమాను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన, ఆయన మ్యానరిజం, యాటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతముగా ఆకట్టుకున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక మందన్న , డాలీ ధనంజయ్, ఫహద్ ఫాసిల్ తదితరులు నటించారు. ఇప్పుడు ఈ చిత్రం రెండవ భాగం ‘పుష్ప: ది రూల్’ అనే టైటిల్‌తో రెడీ అవుతుంది. పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప 3 కూడా వస్తుందని ఓ వార్త వైరల్ అవుతుంది. మూడో పార్ట్ గా ‘పుష్ప: ది రోర్’ వస్తుందని అంటున్నారు. ఇది విన్న అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటించాడు. ఈ సినిమా కథ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. పుష్పరాజ్ కూలిగా వచ్చి స్మగ్లర్లతో చేతులు కలిపి డాన్‌గా ఎదుగుతాడు. అతను ఎదిగిన తీరును పుష్పలో చూపించారు. సెకండ్ పార్ట్ లో పార్ట్ వన్ కు మించి ట్విస్ట్ లు, యాక్షన్ సీన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. అలాగే సుకుమార్ పుష్ప 3 కూడా ప్లాన్ చేస్తున్నారని దీనికి ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ‘కేజీఎఫ్’ ఇప్పటికే రెండు భాగాలుగా రాగా, మూడో భాగం కూడా సిద్దమవుతుంది. దీన్ని ‘పుష్ప’ టీమ్ కూడా ఫాలో అవుతోంది. ‘పుష్ప 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్ట్ 15న సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సినిమా కథ విదేశాలకు వెళ్లనుందని, సినిమా షూటింగ్ కోసం టీమ్ జపాన్ వెళ్లనుందని అంటున్నారు.
అల్లు అర్జున్ ‘పుష్ప 2’తో పాటు మరికొన్ని సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘పుష్ప’ కోసం బన్నీ చాలా ఏళ్లు కేటాయించాడు. దీంతో పుష్ప 2 తర్వాత వరుస కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయనున్నాడు. దీంతో ప్రస్తుతం ‘పుష్ప 3’ గురించి ఆలోచించడం లేదని తెలుస్తోంది. అలాగే దర్శకుడు సుకుమార్‌కి ఇతర కమిట్‌మెంట్లు కూడా ఉన్నాయి. ఈ కారణాల వల్ల ‘పుష్ప 3’ సెట్ కావడానికి మరింత సమయం పడుతుందని తెలుస్తోంది. ‘పుష్ప 2’ క్లైమాక్స్ చూసిన తర్వాతే దీనిపై క్లారిటీ వస్తుంది. చిత్రయూనిట్ దీని పై స్పందించకపోవడంతో ఇవ్వని రూమర్స్ మాత్రమే అని కొంతమంది కొట్టిపారేస్తున్నారు.
Happy Birthday to My Genius Sukku Darling #Sukumar pic.twitter.com/ni8c0vu8OZ
— Allu Arjun (@alluarjun) January 11, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




