AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dunki OTT : ఓటీటీలోకి షారుఖ్ ఖాన్ డంకీ .. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..

పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో సాలిడ్ సక్సెస్ లు అందుకున్నారు. ఏడాది ప్రారంభంలో వచ్చిన 'పఠాన్' సినిమా వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేసింది. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన 'జవాన్' సినిమా కూడా ఇదే బజ్‌ని అందుకుంది. ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 21న ‘డుంకీ’ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. 'జవాన్', 'పఠాన్' చిత్రాలతో పోలిస్తే 'డంకీ'ని థియేటర్లలో చూసిన వారి సంఖ్య తక్కువే.

Dunki OTT : ఓటీటీలోకి షారుఖ్ ఖాన్ డంకీ .. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..
Dunki Movie
Rajeev Rayala
|

Updated on: Feb 07, 2024 | 6:31 PM

Share

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ మొన్నటి వరకు వరుస ఫ్లాప్స్ తో సతమతం అయ్యారు. ఇక గత ఏడాది మూడు సినిమాలతో సక్సెస్ అందుకొని హ్యాట్రిక్ కొట్టారు. పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో సాలిడ్ సక్సెస్ లు అందుకున్నారు. ఏడాది ప్రారంభంలో వచ్చిన ‘పఠాన్’ సినిమా వెయ్యి కోట్ల రూపాయలను వసూలు చేసింది. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ‘జవాన్’ సినిమా కూడా ఇదే బజ్‌ని అందుకుంది. ఏడాది చివర్లో అంటే డిసెంబర్ 21న ‘డుంకీ’ సినిమా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. ‘జవాన్’, ‘పఠాన్’ చిత్రాలతో పోలిస్తే ‘డంకీ’ని థియేటర్లలో చూసిన వారి సంఖ్య తక్కువే. ఈ సినిమాను ఓటీటీలో చూస్తే చాలు అనుకునే ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అందుకే ‘డుంకీ’ సినిమా OTT విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు .

‘డంకీ’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. అయితే దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఫిబ్ర‌వ‌రి 16న ‘డ‌ంకీ’ సినిమా ఓటీటీకి వ‌స్తుంద‌ని అంటున్నారు. ‘జియో సినిమా’ ద్వారా ఈ సినిమా అందుబాటులోకి రానుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై చిత్రబృందం లేదా ఓటీటీ సంస్థ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. ‘డంకీ’ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించారు. విక్కీ కౌశల్, తాప్సీ పన్ను, బొమన్ ఇరానీ తదితరులు ఇతర పాత్రల్లో నటించి మెప్పించారు. ‘డంకీ’ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడంతో ఈ సినిమా పెద్దగా సందడి చేయలేదు. అయితే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 212 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

అక్రమ మార్గాల్లో ఇతర దేశాల సరిహద్దుల్లోకి చొరబడే భారతీయుల కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘డంకీ’. రాజ్‌కుమార్ హిరానీ ప్రతి సినిమాలోనూ ఓ ప్రత్యేక ఇతివృత్తాన్ని ప్రేక్షకులకు అందజేస్తుంటారు. ‘డంకీ’ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నమే జరిగింది. షారూఖ్ ఖాన్ తన హ్యాట్రిక్ విజయం తర్వాత కొత్త సినిమాని అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ సెలక్షన్‌లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆయన తదుపరి సినిమా ప్రకటనపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరో వైపు షారుఖ్ ఖాన్ పిల్లలు కూడా సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉన్నారు. కూతురు సుహానా ఇప్పటికే నటిగా ఎంట్రీ ఇచ్చింది. కొడుకు ఆర్యన్ ఖాన్ యాక్టింగ్ కాకుండా డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
భోజనం తర్వాత ఇలా ఓ పాన్‌ నోట్లో వేసుకోండి..! ప్రయోజనాలు తెలిస్తే
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
టీ20 వరల్డ్‌కప్‌-2026 రామసేతు నుంచి ట్రోఫీ టూర్ షురూ
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
వర్షం కాదు, వెలుతురు కాదు..ఇప్పుడు గాలి కూడా మ్యాచ్‎ను ఆపేస్తోంది
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
కొడుక్కి గ్రౌండ్లో బ్యాటింగ్ పాఠాలు చెప్తున్న అమ్మ వీడియో వైరల్
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
హైందవ ధర్మం ఎలా పరిడవిల్లుతుందో మీరే చూడండి...
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
స్టార్ హీరోతో ఒక్క సినిమా.. దెబ్బకు ఇండస్ట్రీకి గుడ్ బై..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
ఈసారి బిగ్ బాస్ 9 ఫినాలే గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్..
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
బావమరిది ఇచ్చిన రూ.80 లక్షలపై పన్ను నోటీసు.. కీలక తీర్పు!
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్
ఆ విలన్ భార్య టాలీవుడ్ హీరోయిన్.. చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్