Janhvi Kapoor: దేవర తర్వాత ఆ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ అందుకున్న జాన్వీ కపూర్..
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు ఈ చిన్నది టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. అందాల భామ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర మూవీ'తో బిజీగా ఉంది. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమాకి సైన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఇది తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

శ్రీదేవి బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో నటించి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కపూర్ కూడా ఫాలో అవుతోంది. సౌత్ ఇండియాలో మరింత బిజీగా అవ్వాలని చూస్తుంది. ఈ చిన్నది బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు ఈ చిన్నది టాలీవుడ్ కు పరిచయం అవుతుంది. అందాల భామ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర మూవీ’తో బిజీగా ఉంది. ఇక ఇప్పుడు మరో తెలుగు సినిమాకి సైన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఇది తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జాన్వీ కపూర్ బాలీవుడ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ‘దడక్’ ఆమె తొలిసారిగా నటించింది. ఈ చిత్రానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు లభించాయి. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆయనకు ఎలా నటించాలో తెలియదని పలువురు విమర్శించారు. ఇప్పుడు రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం అందుకుందని తెలుస్తోంది.
రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన ‘RC 16’ లో జాయిన్ కానున్నాడు. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి కథానాయికగా జాన్వీ కపూర్‌ని ఖరారు చేసినట్లు సమాచారం. ఇది పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ అని, జాన్వీ డిగ్లామ్ లుక్‌లో మెరిసేందుకు రెడీ అవుతుందని అంటున్నారు.
బుచ్చిబాబు ఇప్పటికే జాన్వీ కపూర్‌కి కథ చెప్పాడట. ఆమె ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పిందని టాక్. అయితే ఈ సినిమాలో రవీనా టాండన్ కూతురు రాషా తడానీ కథానాయికగా నటిస్తుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె ప్లేస్ లోకి జాన్వీ వచ్చిందని తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇప్పటికే దర్శకుడికి కొన్ని ట్యూన్స్ ఇచ్చాడు కూడా..
జాన్వీ కపూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
జాన్వీ కపూర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
