RRR Movie: ‘ఆర్ఆర్ఆర్ అద్భుతం’.. రాజమౌళి సినిమాకు స్పైడర్ మ్యాన్ ఫిదా..

ఇందులో నటించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును అందుకుని చరిత్ర సృష్టించిందీ ట్రిపుల్ ఆర్. ఇప్పటికే ఈ సినిమాపై హాలీవుడ్ నటీనటులు ప్రశంసలు కురిపించగా.. తాజాగా స్పైడర్ మ్యాన్ హీరో టామ్ హాలండ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

RRR Movie: 'ఆర్ఆర్ఆర్ అద్భుతం'.. రాజమౌళి సినిమాకు స్పైడర్ మ్యాన్ ఫిదా..
Rrr, Tom Holland
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 05, 2023 | 1:28 PM

ఆర్ఆర్ఆర్.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. దేశాన్ని కాదు.. వరల్డ్ వైడ్ మూవీ లవర్స్‏ను కట్టిపడేసింది. దాదాపు 600 కోట్ల రూపాయలతో నిర్మిస్తే వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేసింది. తన ప్రతిభతో ప్రపంచ దేశాల ప్రముఖులు.. హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఇందులో నటించిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును అందుకుని చరిత్ర సృష్టించిందీ ట్రిపుల్ ఆర్. ఇప్పటికే ఈ సినిమాపై హాలీవుడ్ నటీనటులు ప్రశంసలు కురిపించగా.. తాజాగా స్పైడర్ మ్యాన్ హీరో టామ్ హాలండ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇటీవల ముంబాయిలో జరిగిన నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి టామ్ హాలండ్ ఇండియా వచ్చారు. మూడు రోజులపాటు ఇక్కడే ఉన్న ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రస్తావించారు. “నాకు భారత్ పర్యటన ఎన్నో మంచి జ్ఞాపకాలనిచ్చింది. కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు అంబానీ కుటుంబానికి ధన్యవాదాలు.

ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన అనుభవం. ఆ పర్యటనను జీవితంలో మర్చిపోలేను. మళ్లీ ఇండియాకు వెళ్లాలనుకుంటున్నాను. మూడు రోజుల్లో ఎంతో మంది ప్రముఖులను కలిశాను. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ పర్యటన అద్భుతంగా గడిచింది. అలాగే హిట్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమాను చూశాను. ఆ మూవీ నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది” అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.