Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: అంగరంగ వైభవంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా చినజియర్ స్వామి..

ఇండియన్ సినీ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ మెయిన్ స్టేజ్ పనులకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతుండగా.. ఈ వేడుకకు దాదాపు లక్ష వరకు అభిమానులు రానున్నట్లు తెలుస్తోంది.

Adipurush: అంగరంగ వైభవంగా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా చినజియర్ స్వామి..
Adipurush
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 05, 2023 | 12:10 PM

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు ప్రాజెక్ట్ కె, సలార్ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటుండగా..మరోవైపు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్నో అంచనాలు నెలకొన్న ఈసినిమా ప్రీ రిలీజ్ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. జూన్ 6న తిరుపతిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. ఇండియన్ సినీ చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ మెయిన్ స్టేజ్ పనులకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరలవుతుండగా.. ఈ వేడుకకు దాదాపు లక్ష వరకు అభిమానులు రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతథిగా జిన జీయర్ స్వామి రాబోతున్నారు.

తిరుపతి వేదికగా రేపు జరిగే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిన జియర్ స్వామి గెస్ట్ గా రానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ ఈవెంట్ లో అజయ్-అతుల్ జై శ్రీరామ్ పాటకు లైవ్ పార్ఫార్మె్న్స్ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా దాదాపు రెండోందల సింగర్స్, రెండొందల డ్యాన్సర్లు ముంబై నుంచి ఈ వేడుకకు వస్తున్నారు. సుమారు రెండు కోట్ల ఖర్చుతో బిగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. రామాయణం ఇతిహాసం ఆధారంగా డైరెక్టర్ ఓంరౌత్ రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుండగా.. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటించారు.

ఇవి కూడా చదవండి

భారీ అంచనాల మధ్య ఈనెల 16న తెలుగుతోపాటు.. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఈ మూవీ ప్రమోషన్స్ వేగం పెంచారు మేకర్స్. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. ఇక తాజాగా రేపు జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకలో ఆదిపురుష్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.