Khushee Ravi: అందమంత అమ్మాయిగా రెడీ అయితే ఇలా ఉంటుందేమో.. యువరాణి రాజసం ఈ ముద్దుగుమ్మకే సొంతం..
ఖుషీ రవి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు. కానీ దియా అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా ప్రేక్షకులకు చేరువైంది ఆ చిత్రం. 2020లో కన్నడలో విడుదలైన దియా చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా ఈ సినిమా యూత్ను ఆకట్టుకుంది. ఇందులో ఖుషీ రవి ప్రధాన పాత్రలో నటించింది.