Kangana Ranaut: మాలాంటి వాళ్ల పరిస్థితేంటి..? ఇన్‌స్టా గ్రామ్ పై మండిపడ్డ కాంట్రవర్సీ క్వీన్..
అటు రాజకీయ నాయకులను కూడా వదల్లేదు ఈ బ్యూటీ. ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేసి హాట్ టాపిక్ గా మారింది.
కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే వివాదాలతో ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ చిన్నది. వివాదం ఎక్కడుంటే ఈ మధ్య కంగనా అక్కడ ఉంటుంది. ఇప్పటికే పలు విషయాల్లో సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. అటు రాజకీయ నాయకులను కూడా వదల్లేదు ఈ బ్యూటీ. ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేసి హాట్ టాపిక్ గా మారింది. ఇక తన సొంత ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ పైన కూడా పలు ఘాటు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా ఈ అమ్మడు మరోసారి తన నోటికి పనిచెప్పింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కంగనా మరోసారి సోషల్ మీడియా పైనే నిందలు వేసింది. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇన్ స్టా గ్రామ్ మూగబోయింది అని అన్నారు కంగనా… ఇన్ స్టా గ్రామ్ మొత్తం ఫోటోల మాయం.. ఫోటోలు తప్ప ఏమి లేదు అంటూ అంటూ కామెంట్స్ చేశారు కంగనా. తాము క్రితం రోజు ఏం రాశామో చూసుకోకూడదని అనుకునే వారికి ఓకే. ఎందుకంటే వారు ఏం చెబుతున్నారో వారికే అర్థం కానప్పుడు అది కనిపించకూడదు కదా. కానీ మాలాంటి వారి పరిస్థితి ఏంటి.? అని ఆమె ప్రశ్నించారు.
అలాగే ట్విట్టర్ ను ఉత్తమ సోషల్ మీడియాగా ఆమె చెప్పుకొచ్చారు. ఇక కంగనాను ట్విట్టర్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. కంగనా రనౌత్ ట్విట్టర్ ఖాతాపై 2021 మే నెలలో నిషేధం విధించారు. నిబంధనలు ఉల్లంఘించడంతో ఆమె ట్విట్టర్ అకౌంట్ ను తొలగించారు.