Rashmika Mandanna: రష్మిక మందన్న గర్ల్‌ఫ్రెండ్ మూవీ టీజర్.. వాయిస్ ఓవర్ ఇచ్చిన స్టార్ హీరో

రష్మిక మందన్న లేటెస్ట్ గా పుష్ప 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది. తాజాగా పుష్ప 2 సినిమాతో మరోసారి భారీ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తుంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.

Rashmika Mandanna: రష్మిక మందన్న గర్ల్‌ఫ్రెండ్ మూవీ టీజర్.. వాయిస్ ఓవర్ ఇచ్చిన స్టార్ హీరో
Rashmika Mandanna
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 09, 2024 | 8:01 PM

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు ఇప్పుడు మారుమ్రోగుతుంది. రీసెంట్ గా పుష్ప 2 సినిమాతో సంచలన విజయం సొంతం చేసుకుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక మందన్న తెలుగులో తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. చలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక.. తక్కువ సమయంలోనే క్లిక్ అయ్యింది. ఇక ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. ఇక ఈ అమ్మడు విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి :మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ళ హాట్ ఫేవరేట్.. చూస్తే ప్రేమలోపడిపోవాల్సిందే

రష్మిక, విజయ్ ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇద్దరూ ఎప్పుడు స్పందించలేదు. రీసెంట్ గాను ఈ ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్న నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌ను విడుదల చేశారు. అలాగే ఈ టీజర్ కు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :కోతి కొమ్మచ్చి ఆడుతున్న ఈ కుర్రాళ్లలో ఓ స్టార్ హీరో ఉన్నాడు.. అమ్మాయిలు వెర్రెక్కిపోతారు అతనంటే.. 

దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న పాత్రకు సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఈ మూవీ టీజర్‌ను షేర్ చేశాడు. “ఈ టీజర్‌లోని ప్రతి సన్నివేశం నాకు బాగా నచ్చింది. ఈ సినిమాను చూడడానికి నేను సంతోషిస్తున్నాను. రష్మిక మనలాంటి చాలా మంది నటులకు లక్కీ హీరోయిన్. పెద్ద స్టార్ నటిగా ఎదిగినా కూడా.. నాకు 8 ఏళ్ల క్రితం పరిచయమైన అమ్మాయిలానే ఉంది. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను’ అని విజయ్ దేవరకొండ ‘ఎక్స్’ ఖాతాలో  రాసుకొచ్చాడు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్ అందరినీ ఆకర్షిస్తోంది. కాగా అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ సినిమా భారీ రికార్డు సృష్టించింది. 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 820 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

ఇది కూడా చదవండి : Tollywood : 14ఏళ్లకే ఎంట్రీ ఇచ్చింది.. ఇప్పుడు మూడు నిమిషాల పాటకు రూ. 2కోట్లు అందుకుంటుంది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.