హీరోగా లోకేష్ కనగరాజ్.. హీరోయిన్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వుది..
సౌత్ సినిమాకు యూనివర్స్ ల ట్రెండ్ పరిచయం చేసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. డ్రగ్స్ మాఫియా నేపధ్యంలో వరుస సినిమాలు చేసిన లోకేష్ కనగరాజ్. ఆ సినిమాలన్నింటినీ కనెక్ట్స్ చేస్తూ వస్తున్నారు. ఖైదీ, విక్రమ్, లియో సినిమాల కథలను ఒకదానికితో ఒకటి కనెక్ట్ చేసేలా లీడ్స్ వదిలారు.

దర్శకుడు లోకేష్ కనగరాజ్ తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలో పుట్టి పెరిగారు. అతను 2016లో ‘అవియల్’ అనే సంకలన అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా సినీప్రయాణం స్టార్ట్ చేశాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడిగా అతని మొదటి చిత్రం మానగరం. 2017లో థ్రిల్లర్ ఆధారిత చిత్రంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో సందీప్ కిషన్, రెజీనా కాసాండ్రా, మునిష్కాంత్, చార్లీ, శ్రీ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా తర్వాత, ఆయన 2019లో కార్తీ నటించిన ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించారు. పూర్తిగా రాత్రిపూట చిత్రీకరించబడిన ఈ చిత్రం పాటలు లేదా హీరోయిన్లు వంటి ఎటువంటి వాణిజ్య అంశాలు లేకుండా పూర్తిగా యాక్షన్ కథపై దృష్టి పెట్టింది.
అప్పుడు మహేష్ బాబు, ఇప్పుడు రవితేజ సినిమాలో.. యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్
ఆ తర్వాత కమల్ హాసన్ తో విక్రమ్ సినిమాను డైరెక్ట్ చేసి సూపర్ హిట్ విజయాన్ని అందించారు.ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో లోకేష్ పేరు మారుమోగింది. వెంటనే విజయ్ దళపతితో కలిసి మాస్టర్ సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత విజయ్ దళపతితో కలిసి లియో సినిమాలో నటించారు. రీసెంట్‌గా కూలీ సినిమా చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబె మోనికా జాన్, మోనిషా ప్లెస్సీ, జూనియర్ ఎంజిఆర్ నటించారు. ఇదిలా ఉంటే ఉంటే ఇప్పుడు లోకేష్ హీరోగా మారనున్నడని తెలుస్తుంది.
అప్పుడు నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి.. 100కోట్లు రెమ్యునరేషన్ అంటుకుంటున్న హీరో
లోకేష్ కనగరాజ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ నటి డైరెక్టర్ అయినటువంటి వామికా గబ్బి నటిస్తుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అయితే దీని పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం భారీగా ప్రచారం జరుగుతుంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుందని అంటున్నారు. ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్ టాక్. త్వరలోనే దీని పై మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. దర్శకుడిగా ఖైదీ 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.
అన్న వద్దన్నా..! ఆ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. టెన్షన్‌లో ఫ్యాన్స్
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి








