Kanguva: ఐదు గెటప్స్‌లో అలరించనున్న సూర్య.. కంగువ కోసం సరికొత్త ప్రయోగం

విభిన్నమైన సినిమాలకు సూర్య పెట్టింది పేరు. సూర్య ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం సూర్య హిస్టారికల్ మూవీలో నటిస్తున్నాడు. సూర్య నటిస్తున్న న్యూ మూవీ కంగువ. సూర్య కెరీర్ లో ఈ సినిమా చాలా ప్రత్యేకంగా సూర్య నటిస్తున్న 42 వ సినిమా ఇది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది.

Kanguva: ఐదు గెటప్స్‌లో అలరించనున్న సూర్య.. కంగువ కోసం సరికొత్త ప్రయోగం
Kanguva
Follow us

|

Updated on: Nov 14, 2023 | 1:26 PM

తమిళ్ సూపర్ స్టార్స్ లిస్ట్ లో సూర్య ఒకరు. సూర్యకు ఉన్న ఫ్యాన్ బేస్  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. విభిన్నమైన సినిమాలకు సూర్య పెట్టింది పేరు. సూర్య ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం సూర్య హిస్టారికల్ మూవీలో నటిస్తున్నాడు. సూర్య నటిస్తున్న న్యూ మూవీ కంగువ. సూర్య కెరీర్ లో ఈ సినిమా చాలా ప్రత్యేకంగా సూర్య నటిస్తున్న 42 వ సినిమా ఇది. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి. అలాగే మొన్నామధ్య ఈ సినిమానుంచి గ్లింమ్స్‌ను విడుదల చేశారు.

సూర్య గెటప్ ఈ సినిమాలో చాలా విభిన్నంగా ఉంది. ఈ మూవీలో సూర్య ఒక క్రూర రాజు పాత్రలో కనిపిస్తాడని గుసగుసలు వినిపించాయి. ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అలాగే సినిమాను త్రీడి ఫార్మేట్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. తమిళ్ తో పాటు తెలుగులో సూర్యనే డబ్బింగ్ చెప్పనున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కంగువ సినిమా గురించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

కంగువ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుందట.. రాజుల కాలంతో పాటు ఇప్పటి జనరేషన్ కు లింక్ ఉంటుందని అంటున్నారు. అలాగే సూర్య ఈ సినిమాలో ఏకంగా ఐదు గెటప్స్ కి కనిపించనున్నారట. 2024 సమ్మర్‌ స్పెషల్‌గా కంగువ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే సైలెంట్ గా షూటింగ్ ను కానిచ్చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండే భారీ ప్రియాడికల్ డ్రామా కంగువ. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను  క్లిక్ చేయండి..