Hero Sri Vishnu: యంగ్ హీరో శ్రీ విష్ణుకు తీవ్ర అస్వస్థత.. ప్లేట్ లెట్స్ తగ్గడంతో ఆస్పత్రిలో చికిత్స..
శ్రీ విష్ణు డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఓ ప్రయివేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం వైద్య సిబ్బంది విష్ణుకి చికిత్సని అందిస్తున్నారు.

Hero Sri Vishnu: యంగ్ హీరో శ్రీ విష్ణు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. గత కొంతకాలంగా ఆయన వైరల్ ఫీవర్ డెంగ్యూ (dengue) తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంటి వద్దనే ఉంటూ.. విష్ణు చికిత్స తీసుకున్నారు.. అయితే రోజు రోజుకీ ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో.. పరిస్థితి తీవ్రమైనట్లు తెలుస్తోంది. దీంతో విష్ణు కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రయివేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం వైద్య సిబ్బంది విష్ణుకి చికిత్సని అందిస్తున్నారు. తమ అభిమాన హీరో ఆస్పత్రిలో చేరినట్లు తెలియగానే ఫ్యాన్స్ ఆయన త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు. పూజలను నిర్వహిస్తున్నారు.
శ్రీ విష్ణు బాణం, సోలో వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. ప్రేమ ఇష్క్ కాదల్ తో నటుడిగా వెలుగులోకి వచ్చాడు. తర్వాత అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో శ్రీ విష్ణు మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. మంచి అభిరుచి ఉన్న నటుడిగా విభిన్న సినిమాలతో గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇటీవల క్రైమ్ థిల్లర్ గా తెరకెక్కిన భళా తందానా రిలీజయింది..అయితే అనుకున్న స్తాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ప్రస్తుతం అల్లూరి సినిమా సెట్ మీద ఉంది. పోలీసు ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపించనున్నాడు. శ్రీ విష్ణు మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి క్రికెటర్ కూడా. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ అండర్ -19 క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం శ్రీ విష్ణు వహించాడు.








