Ram Pothineni: షాకింగ్ నిర్ణయం తీసుకున్న రామ్… కొత్త సినిమా కోసం ఇలా
దేవదాసు సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు రామ్ పోతినేని. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ మూవీలో నటించాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కించారు.

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని వెర్సటైల్ యాక్టర్. క్యారెక్టర్లు, లుక్స్ పరంగా ఎప్పటికప్పుడు డిఫరెన్స్ చూపించే హీరో. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అలాగే హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుం డా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. చివరిగా రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు మరో కొత్త లుక్, క్యారెక్టర్‌తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు రామ్. ఆయన కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమానుంచి రామ్ క్యారెక్టర్ లుక్ ఆ మధ్య విడుదల చేశారు.
మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్న సినిమా హీరోగా రామ్ 22వది. ఈ సినిమా ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ‘మీకు సుపరిచితుడు… మీలో ఒకడు… మీ సాగర్’ అంటూ రామ్ పాత్రను పరిచయం చేశారు దర్శకుడు మహేష్ బాబు.
రామ్ క్యారెక్టర్ లుక్ చూస్తే… వింటేజ్ ఫీలింగ్ కలుగుతుంది. పాత రోజుల్లో ఉపయోగించే సైకిల్, రామ్ లాంగ్ హెయిర్ అండ్ క్లీన్ షేవ్, అన్నిటికి మించి రామ్ ముఖంలో నవ్వు.. ఫస్ట్ లుక్ చూడగానే ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతోంది. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌కు ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడట. అదేంటంటే ఈ సినిమాలో ఓ సాంగ్ ను రామ్ రాశాడట. ఓ లవ్ సాంగ్ ను రాశాడట రామ్ చాలా క్యాచీ లిరిక్స్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేలా ఉంటుందట ఈ సాంగ్. త్వరలోనే ఈ సాంగ్ గురించి అప్డేట్ ఇవ్వనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
