- Telugu News Photo Gallery Cinema photos Do you know any missing movie of Nani and Naga Chaitanya combo?
నాని, నాగచైతన్య కాంబోలో మిస్ అయిన క్రేజీ మూవీ ఏదో తెలుసా?
ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టార్ హవా కొనసాగుతోంది. స్టార్ హీరోల కాంబోలో వచ్చిన ఏ మూవీ అయినా సరే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది. అయితే ఇప్పటి వరకు నేచురల్ స్టార్ నాని మల్టీస్టార్ మూవీ మాత్రం రాలేదు. అయితే ఆయన కూడా మల్టీస్టార్ మూవీని ప్లాన్ చేశారు కానీ, కొన్ని కారణాల వలన అది ఆగిపోయిందంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Updated on: Feb 28, 2025 | 12:25 PM

Nani

కానీ ఆయనకు డేట్స్ కుదరకపోవడంతో సినిమా నుంచి నాని తప్పుకోవాల్సి వచ్చిందంట. అతే కాకుండా అప్పుడు సునీల్‌కు మంచి క్రేజ్ ఉండటంతో, ఆయనను సంప్రదించడంతో ఆయన వెంటనే ఒకే చెప్పేశారంట.

ఇంతకీ ఆ మూవీ ఏంటో అర్థం అయ్యిందా.. తడాఖా. ఇలా నాని, నాగచైతన్య కాంబోలో రావాల్సిన తడాఖామూవీ, సునీల్, చైతూ కాంబోలో తెరకెక్కిందంట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇక ఈ సినిమాలో సునీల్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడు. అమాయకత్వంతో కనిపిస్తూ.. సునీల్ తన పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు. మొదట్లో చాలా అమాయకంగా ఉండి, తర్వాత ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మారిపోతాడు.

అయితే ఈ పాత్రలో నాని చేసి ఉంటే ఇంకా సూపర్ ఉండేది, క్రేజీ కాంబో మిస్ అయ్యింది అంటున్నారు నాని అభిమానులు. ఇక ప్రస్తుతం నాని వరస బ్లాక్ బస్టర్స్‌తో దూసుకెళ్తున్నాడు. ఇక చైతూ, తండేల్ మూవీ సక్సెస్ ఏంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.