కెరీర్ మొదట్లో 30 ఫ్లాప్‌లు..60 ఏళ్లలో ఫుల్ బిజీ అయిపోయిన స్టార్ హీరో ఇతనే?
ఇండస్ట్రీ ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తుందో తెలియని ఓ ప్రపంచం. ఒకప్పుడు స్టార్‌గా ఎదిగి, కోట్లు సంపాదించుకున్న వారిని సైతం కిందకు నెట్టేస్తుంది. ఎక్కడో చిన్న పాత్రలు చేసుకునేవారిని స్టార్‌ను చేస్తుంది. అంతేకాకుండా, కొన్ని సార్లు ఫ్లాప్స్, మరికొన్ని సార్లు వరసగా సక్సెస్‌లు ఇలా ఏ నటుడి జీవితం ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు.
Updated on: Feb 28, 2025 | 12:13 PM

అయితే దర్శకుడిగా, నిర్మాతగా, స్టార్ హీరోగా, చివరకు రాజకీయనాయుడిగా మారిన ఓ సీనియర్ నటుడి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తన 22 ఏళ్ల సినీ జీవితంలో ఈ హీరో ఎన్నో ఫ్లాప్స్ చూశాడు. కానీ ఆరవై ఏళ్ల వయసులో మాత్రం వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయి, ఇండస్ట్రీనే షేక్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా?

సీనియర్ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్. ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బేతాబ్ సినిమా ద్వారా చాలీవుడ్ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టాడు. అంతే కాకుండా ఈ మూవీలో ఈ హీరో నటకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి ఎంపికయ్యాడు.దీని తర్వాత ఈ హీరో చాలా సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.

ముఖ్యంగా ఏక్ ప్రేమ్ కథా .. అంటూ సోలోగా తెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఈ మూవీతో సోలో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ మూవీతర్వాత సన్నీ డియోల్ సోలోగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం అందుకున్నాయి.

22 ఏళ్ల దాదాపు 30 ఫ్లాప్స్ అందుకున్నాడంట ఈ హీరో. అయితే చివరకు 66 ఏళ్ల వయసులో ఏక్ ప్రేమ్ కథ సీక్వెల్ గాదర్2తో మళ్లీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో ప్రస్తుతం ఈ హీరో వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడంట.

2023లో గాదర్ 2 విడుదలైనప్పటి నుంచి ఈ హీరో వరసగా సోలోగా హిట్స్ అందుకుంటూ.. ఆరుపదుల వయసులో కూడా తన సత్తాచాటుతున్నాడంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.