టాలీవుడ్ మోస్ట వాంటెడ్‌గా మారిపోతున్న బాలీవుడ్ హీరోస్.. ఎవరు వారంటే?
బాలీవుడ్‌లో ఒకప్పుడు బాక్సాఫీస్ బద్దలుకొట్టిన హీరోలు వాళ్లు..! వయసుతో పాటే ఇమేజ్ తగ్గిపోయింది.. తగ్గిన ఇమేజ్‌తో పాటే మార్కెట్ కూడా పడిపోయింది..! కానీ కెరీర్‌లో ఏదో టైమ్‌లో సుడి తిరుగుతుంది అంటారు కదా..! ఆ సీనియర్ హీరోల విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. కొడితే కుంభస్థలమే అన్నట్లు.. తెలుగులో దున్నేస్తున్నారు వాళ్లు. ఇంతకీ ఎవరా హీరోలు..?
Updated on: Feb 28, 2025 | 12:09 PM

ఖతర్నాక్ క్యారెక్టర్స్‌తో టాలీవుడ్ టూ బాలీవుడ్ దున్నేస్తున్నారు ఖల్ నాయక్. మరీ ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్‌గా మారిపోతున్నారు సంజూ బాబా. హీరోగా హ్యాపీ రిటైర్మెంట్ తీసుకుని.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫుల్ బిజీ అవుతున్నారు సంజయ్. కేజియఫ్ 2 తర్వాత సంజయ్ దత్ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

కేజియఫ్ 2 తర్వాత లియోలో ప్రతినాయకుడిగా నటించారు సంజయ్ దత్. గతేడాది డబుల్ ఇస్మార్ట్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం రాజా సాబ్‌లో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

అలాగే సాయి ధరమ్ తేజ్ సంబరాల యేటిగట్టులో సంజూ బాబాను విలన్‌గా తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే బాబీ డియోల్ కూడా తెలుగులో మోస్ట్ వాంటెడ్ అయిపోయారు.

యానిమల్ తర్వాత బాబీ డియోల్ జాతకమే మారిపోయింది. దానికి ముందు పదేళ్ళు ఖాళీగా ఉన్న బాబీ.. ఇప్పుడు మరో పదేళ్ళ వరకు ఖాళీగా ఉండేలా కనిపించట్లేదు. డాకు మహారాజ్‌తో తెలుగులోనూ హిట్ కొట్టారు.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ప్రభాస్ స్పిరిట్, విజయ్ జన నాయగన్ సినిమాలతో బిజీగా ఉన్నారు బాబీ. మొత్తానికి ఈ బాలీవుడ్ హీరోలిప్పుడు సౌత్‌ను ఏలేస్తున్నారు.
