- Telugu News Photo Gallery Cinema photos Pooja Hegde Smart Strategy: Balancing Films & Special Songs for Longevity
రూటు మార్చిన జిగేల్ రాణి.. ఏం చేస్తుందో తెలుసా?
ఇప్పుడున్న పోటీలో రెండేళ్ళ కంటే ఎక్కువ స్టార్ హీరోయిన్ హోదా కంటిన్యూ చేయడం కష్టమే. ఈ లోపు ఎవరో ఒకరు వచ్చేస్తారు.. ఈలోపు మరో దారి చూసుకోవాల్సిందే. పూజా హెగ్డే సైతం ఇదే చేస్తున్నారిప్పుడు. హీరోయిన్ ఆఫర్స్ వస్తే వెల్ అండ్ గుడ్ లేదంటే మాత్రం మరో ఆప్షన్ రెడీగా ఉంది. మరి పూజా ఫాలో అవుతున్న ఆ రూట్ ఏంటి..?
Updated on: Feb 28, 2025 | 12:10 PM

ఇండస్ట్రీలో టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు.. హీరోయిన్లకు అయితే మరీనూ..! ఒక్క కొత్తమ్మాయి చాలు.. పాత వాళ్లను పక్కనబెట్టడానికి..! పూజా హెగ్డే విషయంలోనూ ఇదే జరుగుతుంది.

తెలుగులో పూర్తిగా ఖాళీ.. తమిళ్లో ఒకటో రెండో సినిమాలున్నాయి.. దాంతో స్పెషల్ సాంగ్స్ వైపు అడుగులేస్తున్నారు పూజా. ఇలాగైతే మరో రెండేళ్లైనా సర్వై అవ్వొచ్చని అమ్మడి ప్లాన్.

ఆరేళ్ళ కిందే రంగస్థలం సినిమాలో రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసారు పూజా హెగ్డే. జిగేల్ రాణి పాటలో పూజా వేసిన స్టెప్పులకు థియేటర్స్ మోతెక్కిపోయాయి. ఆ తర్వాత ఎఫ్ 3 లో లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలా.. అంటూ స్పెషల్ చిందులేసారు. ఇది బాగానే వర్కవుట్ అయింది. తాజాగా రజినీకాంత్ సినిమాలో సూపర్ ఛాన్స్ కొట్టేసారు పూజా.

రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీలో పూజా నటిస్తున్నారు. జైలర్‌లో తమన్నా తరహాలో సాగే పాత్ర ఇదని తెలుస్తుంది.

తాజాగా సెట్స్‌లో జాయిన్ అయ్యారు పూజా. దాంతో పాటు సూర్యతో రెట్రో, విజయ్‌తో జన నాయగన్ సినిమాలు చేస్తున్నారు. ఇవి కాకుండా సోషల్ మీడియాలో ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటారు ఈ ముద్దుగుమ్మ.
