AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raghava Lawrence: నువ్వు దేవుడు సామీ.. మరో మంచి పనికి లారెన్స్ శ్రీకారం.. పేదల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ..

సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన అతి కొద్ది మంది వారిలో రాఘవ లారెన్స్‌ ఒకరు. ఒక సైడ్‌ డ్యాన్సర్‌గా కెరీర్‌ ఆరంభించిన అతను హీరోగా, డ్యాన్స్‌ మాస్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా రాణిస్తున్నాడు. మల్టీ ట్యాలెంటెడ్‌ పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీటన్నిటికీ మించి లారెన్స్‌ చేస్తున్న సహాయ కార్యక్రమాలు అతనికి ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టాయి.

Raghava Lawrence: నువ్వు దేవుడు సామీ.. మరో మంచి పనికి లారెన్స్ శ్రీకారం.. పేదల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ..
Raghava Lawrence
Basha Shek
|

Updated on: Sep 06, 2023 | 8:39 AM

Share

సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన అతి కొద్ది మంది వారిలో రాఘవ లారెన్స్‌ ఒకరు. ఒక సైడ్‌ డ్యాన్సర్‌గా కెరీర్‌ ఆరంభించిన అతను హీరోగా, డ్యాన్స్‌ మాస్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా రాణిస్తున్నాడు. మల్టీ ట్యాలెంటెడ్‌ పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. వీటన్నిటికీ మించి లారెన్స్‌ చేస్తున్న సహాయ కార్యక్రమాలు అతనికి ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టాయి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల తన ట్రస్టుకు డబ్బులు పంపొద్దంటూ, వాటిని డబ్బుల్లేక ఇబ్బందులు పడే ట్రస్టులకు ఇవ్వాలని సూచించారు రాఘవ లారెన్స్‌. తాజాగా మరోసారి తన మంచి మనసును చాటుకున్నారీ రియల్‌ హీరో. పేదల కోసం మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి ఒక వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారాయన. ‘ స్వయంగా ఆపదలో ఉన్నవారి ఇంటికి వెళ్లి వారి కష్టాలను సేవ చేయడం ఎంతో సంతోషం. నా ప్రజలకు సేవ చేయడం కోసం ఆ దేవుడు నన్ను ఎంచుకున్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. ఇందుకోసం మీ ఆశీస్సులు కావాలి’ అని ట్విట్టర్‌ లో రాసుకొచ్చాడు రాఘవ లారెన్స్‌.

ఈ వీడియోలో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతోన్న పేదలు, పేద విద్యార్థుల ఇంటికి వెళ్లాడు లారెన్స్‌. వారి స్థితిగతులను తెలుసుకుని భరోసా ఇచ్చాడు. ఇల్లు కట్టుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి, జీవనం సాగించడానికి ఆర్థిక సాయం అందజేయడం ఈ వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అభిమానులు, నెటిజన్లు లారెన్స్‌ చేస్తున్న పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘దైవం మనుష్య రూపేణా’ అనడానికి రాఘవ లారెన్స్‌ నిదర్శనమంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. త్వరలోనే చంద్రముఖి 2 మూవీతో మన ముందుకు వస్తున్నారు లారెన్స్‌. పి. వాసు తెరకెక్కించిన ఈ మూవీలో బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వడివేలు, రాధికా శరత్‌కుమార్‌, లక్ష్మీ మేనన్‌, రావు రమేశ్‌, ఆర్‌ఎస్‌ శివాజీ, మనోబాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

ఇవి కూడా చదవండి

రాఘవ లారెన్స్ ట్విట్టర్ లో  షేర్ చేసిన వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పిల్లలు అతిగా ఫోన్‌ చూస్తున్నారా? ఈ ట్రిక్స్‌తో వారిని మార్చండి!
పిల్లలు అతిగా ఫోన్‌ చూస్తున్నారా? ఈ ట్రిక్స్‌తో వారిని మార్చండి!
బళ్లారిలో టెన్షన్.. టెన్షన్.. MLA గాలిజనార్దన్ రెడ్డి ఇంటిపై దాడి
బళ్లారిలో టెన్షన్.. టెన్షన్.. MLA గాలిజనార్దన్ రెడ్డి ఇంటిపై దాడి
కాసేపట్లో అసెంబ్లీ సమావేశం.. నీళ్లపైనే యుద్ధం..
కాసేపట్లో అసెంబ్లీ సమావేశం.. నీళ్లపైనే యుద్ధం..
'ప్రపంచ కప్ 2027 తర్వాత వన్డే క్రికెట్‌‌కు మరణమే..'
'ప్రపంచ కప్ 2027 తర్వాత వన్డే క్రికెట్‌‌కు మరణమే..'
ఆడుతూ పాడుతూ ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలు ఇవే!
ఆడుతూ పాడుతూ ఈజీగా డబ్బు సంపాదించే మార్గాలు ఇవే!
మరికాసేపట్లోనే GATE 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్
మరికాసేపట్లోనే GATE 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్
ఒకప్పుడు అరటి పండ్లు అమ్మాడు .. ఇప్పుడు 400 కోట్ల సినిమాతో సంచలనం
ఒకప్పుడు అరటి పండ్లు అమ్మాడు .. ఇప్పుడు 400 కోట్ల సినిమాతో సంచలనం
ఒకే కథతో బాక్సాఫీస్ వార్.. గెలిచిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఒకే కథతో బాక్సాఫీస్ వార్.. గెలిచిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
JEE అడ్వాన్స్‌డ్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు తేదీలు ఇవే
JEE అడ్వాన్స్‌డ్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు తేదీలు ఇవే
వెంకీతో హీరోయిన్‌గా, ఫ్రెండ్‌గా నటించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
వెంకీతో హీరోయిన్‌గా, ఫ్రెండ్‌గా నటించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?