Ballari Banner Row: బళ్లారిలో టెన్షన్.. టెన్షన్.. MLA గాలి జనార్దన్ రెడ్డి ఇంటిపై కాల్పులు! ఒకరు మృతి
కర్నూలు జిల్లాలోని బళ్లారిలో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై శుక్రవారం అర్ధరాత్రి దాడులు జరిగాయి. ఆయన ఇంటిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో గంగావతి ఎమ్మెల్యే అయిన గాలి జనార్దన్ రెడ్డి.. బళ్లారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గాల మధ్య గురువారం మధ్య రాత్రి నుంచి కాల్పులు ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి..

కర్నూలు, జనవరి 2: రేపు బళ్లారిలో కాంగ్రెస్ నేతలు వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వర్గీయులు గాలి జనార్దన్ రెడ్డి ఇంటిదగ్గర ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. దీనిని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ వర్గీయులు రాళ్లు రువ్వడం వివాదం రాజుకుంది. ఇరు వర్గాలకు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుతూ.. తుపాకులతో కాల్పులు జరిపారు. తుపాకి కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ (30) మృతి చెందారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చిలికి చిలికి గాలి వానగా మారాయి. పోలీసులు, ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులు తన పైన, తన కుటుంబీకుల పైన, తన కార్యకర్తల పైన కాల్పులు జరిపారని గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల ఆరోపణలు చేస్తున్నారు. కాదు.. కాదు.. గాలి జనార్దన్ రెడ్డి వర్గీయులు జరిపిన కాల్పుల్లోనే తమ కార్యకర్త మృతి చెందాడని కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం బళ్లారిలో ఉద్రిక్తత కొనసాగుతుంది.
కాగా బళ్లారిలో రెండు దశాబ్దాల నాటి పగలు కక్షలు కార్పన్యాలు బద్దలైనట్లైంది. 20 ఏళ్ల నుంచి గాలి జనార్దన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మధ్య వర్గ కక్షలు, రాజకీయపగలు ఉన్నాయి. సూర్యనారాయణ రెడ్డి కొడుకే ప్రస్తుత బళ్లారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి. అయితే రేపు జరగనున్న వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ రెండు వర్గాల మధ్య ఘర్షణలకు కేంద్రంగా మారింది. ఇది ప్రస్తుతం బళ్లారి అంతట తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ మంత్రి శ్రీరాములు స్వయంగా వచ్చి చెప్పిన కూడా రెండు వర్గాలు వినేపరిస్థితి కనిపించలేదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ముగించుకొని గంగావతి నుంచి బళ్లారికి రాత్రి జనార్దన్ రెడ్డి రాగానే ఒక్కసారిగా కారు పైకి, ఇంటి పైకి రాళ్లు, కాల్పులు జరిగాయి. ఈ దాడుల్లో గాలి జనార్దన్ రెడ్డికి ఎలాంటి హాని కలగలేదు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారు. దాడుల నేపథ్యంలో బళ్లారి అంతట 144 సెక్షన్‌ను అధికారులు అమలు చేస్తున్నారు.
మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి బిజెపి నేత శ్రీరాములు పైన హత్య కేసులు పోలీసులు నమోదు చేశారు. తమ పైన కాల్పులు జరిపి, తన ఇంటి పైన రాళ్లు రువ్విన వారి పైన కాకుండా తమపైనే కేసులు నమోదు చేస్తారా? అంటూ గాలి జనార్దన్ రెడ్డి వర్గీయుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




