Venkatesh: విక్టరీ వెంకటేశ్ పక్కన హీరోయిన్‌గా, ఫ్రెండ్‌గా మెప్పించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
హీరోల కెరీర్ కొనసాగినంత ఎక్కువ కాలం హీరోయిన్ల కెరీర్ ఉండదు. అందుకే హీరోలు ఇంకా హీరోలుగా చేస్తుండగానే కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతారు. అలనాటి స్టార్ హీరోయిన్లు నేడు హీరోకు చెల్లిగా, అక్కగా లేదా స్నేహితురాలిగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో ఒదిగిపోతూ, సినీ ప్రేమికులను మెప్పిస్తున్నారు.

వెండితెరపై కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ మర్చిపోలేం. ముఖ్యంగా విక్టరీ వెంకటేశ్ సరసన నటించిన హీరోయిన్ల జాబితా చూస్తే ఒక స్పెషల్ క్రేజ్ కనిపిస్తుంది. అయితే, ఆ స్టార్ హీరోయిన్ ఒకప్పుడు ఆయనతో కలిసి డ్యూయెట్లు పాడింది.. కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. కాలం మారింది.. అదే నటి కొన్నేళ్ల తర్వాత అదే హీరోకు ఫ్రెండ్ మారి మెప్పించింది. ఒకప్పుడు ప్రేమికులుగా చూసిన కళ్లే, తర్వాత వారిని స్నేహితులుగా చూసి ఎమోషనల్ అయ్యాయి. ఇంతకీ ఆ వెర్సటైల్ యాక్ట్రెస్ ఎవరో, ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం.
ముద్దుల ప్రియుడిగా రొమాన్స్..
తొంభైల కాలంలో తెలుగు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన జోడీ అది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ముద్దుల ప్రియుడు’ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఈ సినిమాలో ఆ హీరోయిన్ గ్లామర్, ఆమె డ్యాన్సులు అప్పట్లో ఒక సంచలనం. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. ఆ సమయంలో వెంకీకి పర్ఫెక్ట్ జోడీగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ, తర్వాతి కాలంలో పవర్ ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఆ సినిమా తర్వాత ఈ జోడీ నటించిన ధర్మచక్రం, చిన్నబ్బాయి కూడా ప్రేక్షకులను అలరించాయి.

Venkatesh And Ramya Krishna
తులసిలో స్నేహబంధం..
కొన్నేళ్ల తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘తులసి’ సినిమాలో ఈ కాంబినేషన్ మళ్ళీ వెండితెరపై మెరిసింది. కానీ ఈసారి సీన్ మారింది. ఒకప్పటి ప్రేమికులు ఈ సినిమాలో స్నేహితులుగా కనిపించారు. ఆమె రమ్యకృష్ణ. అవును. అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ, తులసి సినిమాలో వెంకటేశ్‌కు స్నేహితురాలిగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు.
నటనలో వైవిధ్యం..
రమ్యకృష్ణ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా తన సత్తా చాటుతున్నారు. వెంకటేశ్‌తో కలిసి చేసిన సినిమాలు ఆమె కెరీర్‌కు మంచి బూస్టప్ ఇచ్చాయి. ‘ముద్దుల ప్రియుడు’లో ప్రేమికురాలిగా ఎంత అల్లరి చేసిందో, ‘తులసి’లో డాక్టర్ క్యారెక్టర్‌లో స్నేహితురాలిగా అంతటి హుందాతనాన్ని ప్రదర్శించింది. ఈ మార్పును ప్రేక్షకులు కూడా చాలా పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నారు. వెంకటేశ్, రమ్యకృష్ణ మధ్య ఉన్న ఆఫ్ స్క్రీన్ బాండింగ్ కూడా చాలా గొప్పది. అందుకే తెరపై వారు ఏ పాత్రలో కనిపించినా సహజంగా ఉంటుంది.
