AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Box Office: బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల వేట.. 2026లో రికార్డులు బద్దలుకొట్టనున్న క్రేజీ సినిమాలు!

టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇవన్నీ ఒకప్పుడు..ఇప్పుడంతా పాన్ ఇండియా, పాన్ వరల్డ్. స్టార్ హీరోలు, మల్టీస్టారర్లు, భారీ బడ్జెట్లు వెరసి బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు. ఈ కొత్త సంవత్సరం వందల కోట్ల మాటను దాటేసిందనే అనిపిస్తోంది. ఇప్పుడింక అంతా వెయ్యి కోట్ల గురించే మాట్లాడుకోవాలి.

Box Office: బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల వేట.. 2026లో రికార్డులు బద్దలుకొట్టనున్న క్రేజీ సినిమాలు!
Rajasaab & Jana Nayagan
Nikhil
|

Updated on: Jan 02, 2026 | 6:00 AM

Share

భారతీయ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు కేవలం హిట్ సినిమాల కోసం మాత్రమే ఎదురుచూడటం లేదు. వెయ్యి కోట్ల మార్కును అందుకోవడమే లక్ష్యంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు సిద్ధమవుతున్నాయి. 2026 సంవత్సరం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించబోతోందని తాజా అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి వస్తున్న కొన్ని భారీ ప్రాజెక్టులు ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పడానికి రెడీ అవుతున్నాయి. ఆ సినిమాల విశేషాలు ఇప్పుడు చూద్దాం.

దళపతి విజయ్ ‘జననాయగన్’..

తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అందరి కళ్లు ‘జననాయగన్’ సినిమాపైనే ఉన్నాయి. దళపతి విజయ్ నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా జనవరి 9, 2026న విడుదల కానుంది. విజయ్ కెరీర్‌లో ఇదే చివరి సినిమా కావచ్చనే వార్తలు ఉండటంతో, ఈ సినిమా వెయ్యి కోట్ల మార్కును ఈజీగా దాటుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పూజా హెగ్డే, మమితా బైజు వంటి స్టార్స్ ఉండటం ఈ సినిమాకు అదనపు బలం.

రామాయణం.. విజువల్ వండర్!

నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణం’ సినిమా 2026లో అతిపెద్ద రిలీజ్‌లలో ఒకటిగా నిలవనుంది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమా బడ్జెట్ వింటేనే కళ్లు తిరుగుతున్నాయి. సుమారు 800 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న ఈ మైథలాజికల్ డ్రామా వెయ్యి కోట్లు కాదు, రెండు వేల కోట్లను లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. యశ్ (రావణుడు) వంటి స్టార్స్ ఈ ప్రాజెక్ట్‌లో ఉండటంతో గ్లోబల్ వైడ్‌గా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.

King And Ramayana

King And Ramayana

జైలర్ 2, కింగ్

సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్ళీ తన మ్యాజిక్ చూపించడానికి సిద్ధమవుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘జైలర్ 2’ (హుకుం) 2026లో థియేటర్లను షేక్ చేయనుంది. మొదటి భాగం సృష్టించిన ప్రభంజనం చూసాక, రెండో భాగం వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ సినిమా కూడా అదే రేంజ్‌లో భారీ యాక్షన్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

Peddi And Hukum

Peddi And Hukum

టాలీవుడ్ నుంచి ప్రభాస్, చరణ్..

కేవలం కోలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్ కూడా ఈ రేసులో గట్టి పోటీకి రెడీగా ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ‘ఫౌజీ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల వసూళ్లను టార్గెట్ చేస్తున్నాయి. వీటితోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ‘డ్రాగన్’ చిత్రాలు 2026 బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు పుట్టించబోతున్నాయి.

మొత్తానికి 2026 సంవత్సరం ఇండియన్ సినిమాకి ఒక స్వర్ణ యుగంలా మారబోతోంది. భారీ వీఎఫ్ఎక్స్, స్టార్ కాస్టింగ్, పవర్‌ఫుల్ స్టోరీ లైన్స్‌తో వస్తున్న ఈ సినిమాలు వెయ్యి కోట్ల మార్కును దాటి కొత్త రికార్డులను సృష్టిస్తాయేమో వేచి చూడాలి.