Chiranjeevi: మెంటల్ మాస్ మావ ఇది.. నాని ప్రొడ్యూసర్‌గా మెగాస్టార్ సినిమా..
మెగాస్టార్ చిరంజీవి నటించే నెక్స్ట్ సినిమాకు దర్శకత్వం వహించేంది 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల అని అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇన్నాళ్లు ఈ వార్త ఓ రూమర్ గా చక్కర్లు కొట్టింది. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో ఉన్నారు చిరు. ఈ సినిమా తర్వాత ఓదెల మూవీ స్టార్ట్ అవుతుంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని నిర్మిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. చిరంజీవి నటించిన లాస్ట్ మూవీ భోళాశంకర్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన్న భోళాశంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. తమిళ్ మూవీ వేదాళం కు రీమేక్ గా వచ్చిన ఈ మూవీ నిరాశపరచడంతో మెగా అభిమానులు ఇప్పుడు విశ్వంభర సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన బింబిసార సినిమాకు దర్శకత్వం వహించి సక్సెస్ అందుకున్నాడు వశిష్ఠ. ఇక ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశారు చిరు.
ఇది కూడా చదవండి :Allu Arjun : పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ట్వీట్
చిరంజీవి తదుపరి చిత్రం మెగాస్టార్‌కి వీరాభిమాని అయిన యంగ్ అండ్ టాలెంటడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దసరా సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుంది. ఇక ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న సినిమాను అనౌన్స్ చేశారు. నేచురల్ స్టార్ నాని యునానిమస్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఇది కూడా చదవండి : అమ్మబాబోయ్..! అస్సలు గుర్తుపట్టలేం గురూ..!! ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
తాజాగా విడుదలైన అధికారిక పోస్టర్ చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది. పోస్టర్‌లోని అద్భుతమైన ఎరుపు రంగు థీమ్ కథకు ప్రధానమైన పాయింట్ ను సూచిస్తుంది. అయితే “అతను హింసలో తన శాంతిని కనుగొంటాడు” అనే కోట్, చిరంజీవి పోషించబోయే మాస్ యాక్షన్ పాత్రను చెప్పకనే చెప్తుంది. ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. వైలెన్స్ ప్రధానాంశంగా ఈ సినిమా ఉండబోతుంది. మరి ఈ సినిమాతో మెగాస్టార్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
ఇది కూడా చదవండి :Nargis fakhri : మాజీ బాయ్ ఫ్రెండ్‌ను హత్య చేసిన స్టార్ హీరోయిన్ సోదరి.. అరెస్ట్ చేసిన పోలీసులు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.