Kichcha Sudeep: మంచి మనసు చాటుకున్న కిచ్చా సుదీప్.. ఆనందంలో అభిమానులు
ఈ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు సుదీప్. ఆ తర్వాత బాహుబలి సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత సుదీప్ నటించిన సినిమాలు తెలుగులోకూడా డబ్ అయ్యాయి.
కన్నడ స్టార్ హీరో సుదీప్ కిచ్చ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో విలన్ గా నటించాడు సుదీప్. ఈ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు సుదీప్. ఆ తర్వాత బాహుబలి సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత సుదీప్ నటించిన సినిమాలు తెలుగులోకూడా డబ్ అయ్యాయి. దాంతో సుధీప్ కి తెలుగులోకూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఇటీవలే విక్రాంత్ రోణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుదీప్. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సుదీప్ కు సంభంధించిన ఒక వార్త కన్నడ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సుదీప్ స్టార్ హీరోగానే కాదు పలు సేవ కార్యక్రమాలు కూడా చేస్త్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయంతో అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.
పుణ్యకోటి దత్తు యోజన కింద కర్ణాటకలోని ఒక్కో జిల్లా నుంచి ఒక్కో ఆవును దత్తత తీసుకోబోతున్నట్టు హీరో సుదీప్ తెలిపారు. అక్రమ రవాణా, పశువధ నుంచి గోవులను కాపాడటమే ధ్యేయంగా కర్ణాటక ప్రభుత్వం ‘పుణ్యకోటి దత్తు యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి కిచ్చా సుదీప్‌కు అంబాసిడర్‌గా కర్ణాటక ప్రభుత్వం నియమించింది.
ఈ సందర్భంగా కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. ఆవుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఎంతో అద్భుతంగా పనిచేస్తోందని అన్నారు. పుణ్యకోటి దత్తు యోజన పథకానికి నన్ను అంబాసిడర్‌గా నియమించి ప్రభుత్వం నా బాధ్యతలను పెంచింది అన్నారు. నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మంత్రి ప్రభు చౌహన్‌కు ధన్యవాదాలు’’ అని సుదీప్ అన్నారు. అలాగే గోవులను దత్తత తీసుకోవాలని అభిమానులకు, సినీ పరిశ్రమలోని నటీనటులకు సుదీప్ పిలుపునిచ్చారు.
ಪುಣ್ಯಕೋಟಿ ರಾಯಭಾರಿಯಾಗಲು ಹೆಮ್ಮೆಪಡುತ್ತೇನೆ. ಜಿಲ್ಲೆಗೊಂದು ಗೋವಿನಂತೆ 31 ಗೋವುಗಳನ್ನು ದತ್ತು ಪಡೆಯುತ್ತಿದ್ದೇನೆ. ಈ ಗೌರವ ಮತ್ತು ಅವಕಾಶ ನೀಡಿದ ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರಕ್ಕೆ ಮತ್ತು ಸಚಿವರಾದ ಪ್ರಭು ಚೌವ್ಹಾಣ್ ಅವರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು.?? pic.twitter.com/fBK3mj9euM
— Kichcha Sudeepa (@KicchaSudeep) November 25, 2022
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..