Shiva Shankar Master : శివశంకర్ మాస్టర్‌కు అండగా మరో స్టార్ హీరో ..10లక్షల ఆర్ధిక సాయం..
ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Shiva Shankar master: ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.. కరోనా భారిన పడిన ఆయన ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకిందని..75శాతం ఇనెఫెక్షన్ ఉండడంతో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఆసుపత్రి బిల్లులు ఎక్కువయ్యాయని.. దాతలెవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని అజయ్ కోరుతున్నారు. అయితే శివశంకర్ మాస్టర్ పరిస్థితి తెలుసుకున్న సినిమా తారలు స్పందిస్తున్నారు. ఇప్పటికే సోనుసూద్ శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. ఆయన ప్రాణాలను రక్షించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు.
తాజాగా హీరో ధనుష్ శివశంకర్ మాస్టర్ కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. హీరో ధనుష్ వైద్య ఖర్చుల నిమిత్తం ఏకంగా రూ.10 లక్షల ఆర్థిక సాయం చేశారు. కరోనా భారిన పడిన శివశంకర్ మాస్టర్ ఆయన కుటుంబం త్వరగా కోలుకోవాలని ధనుష్ ఆకాంక్షించారు. అయితే ధనుష్ సాయం చేసిన విషయాన్నీ గుట్టుగా ఉంచారు. ఆయన ఇలా పబ్లిసిటీ లేకుండా సాయంచేయడం పై అందరు ప్రసంశలు కురిపిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :