Brother Sister Songs: మాటల్లో వర్ణించలేని అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతిరూపం ఈ మధుర గీతాలు..
Raksha Bandhan: ఈ సృష్టిలో గొప్ప బంధాల్లో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధం ఒకటి. ప్రతీ అక్క తన తమ్ముడిని తల్లిలా చూసుకుంటుంది. అన్న తన చెల్లెల్లి క్షేమం కోసమే ఆరాటపడుతుంటాడు. తోబుట్టువు కష్టంలో ఉందని తెలిస్తే చాలు...
Raksha Bandhan: ఈ సృష్టిలో గొప్ప బంధాల్లో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధం ఒకటి. ప్రతీ అక్క తన తమ్ముడిని తల్లిలా చూసుకుంటుంది. అన్న తన చెల్లెల్లి క్షేమం కోసమే ఆరాటపడుతుంటాడు. తోబుట్టువు కష్టంలో ఉందని తెలిస్తే చాలు, ప్రపంచాన్ని ఎదురించైనా తన చెల్లెలికి అండగా నిలుస్తుంటారు. ఎంత దూరానా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా తన అన్న మంచి కోరుకుంటుంది సోదరి. ఇలా అపురూపమైన ఈ బంధానికి గుర్తుగానే రాఖీ పండుగను నిర్వహించుకుంటాం. ఏడాదంతా ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా, ఒక్క రోజు మాత్రం తన సోదరుడి ఇంటికి వెళ్లి రాఖీ కడుతుంది సోదరి. నీకు నేను రక్షగా ఉన్నాను అని చాటిచెబుతుంది.
ఎలాంటి కల్మషంలేని ఈ బంధాన్ని మాటల్లో వర్ణించడం నిజంగా సులువైన విషయమేమి కాదు. అలా మాటలకు అందని భావాలే పాటల రూపంలో మనల్ని ఆకట్టుకుంటాయి. అలా అన్నచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధం విలువను చాటి చెప్పే ఎన్నో పాటలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బంధం బలాన్ని చాటి చెప్పేలా మన రచయితలు అక్షరాలను తీర్చిదిద్దితే దానికి లయబద్ధమైన సంగీతాన్ని అందించి పాటను వినసోపుంగా మార్చారు సంగీత దర్శకులు. ఇప్పటి వరకు తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచి, ఎప్పటికీ మన మదిలో నిలిచిపోయిన కొన్ని బ్రదర్, సిస్టర్ ఎమోషనల్ పాటలను రాఖీ పండుగ సందర్భంగా ఓసారి గుర్తు చేసుకుందామా.?
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం చిత్రం అన్నాచెల్లెళ్ల బంధాన్ని నిలువుటద్దంలా నిలుస్తుంది. తన చెల్లి కోసం ఏకంగా గుండాయిజాన్ని రూపు మాపే అన్న పాత్రలో పవన్ అద్భుత నటనను కనబరిచారీ సినిమాలో. ఇక ఈ సినిమాలోని ‘అన్నయ్యా అన్నావంటే’ అనే పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుట్టింటింకి రావే చెల్లి’ సినిమాలోని పాటలు కూడా అన్నాచెల్లెళ్ల బంధానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఈ సినిమాలోని పాటలు వింటే భావోద్వేగంతో కళ్లు చమ్మగిల్లడం ఖాయం కదూ!
నాగశౌర్యవ హీరోగా తెరకెక్కిన ‘ఆశ్వత్థామ’ చిత్రంలోని ‘అండగా అన్న’ అనే పాట ఆకట్టుకుంటుంది. తన చెల్లికి జరిగిన అన్యాయానికి ఎదురొడ్డి నిలిచే అన్న పాత్రలో నాగశౌర్వ మంచి నటనను కనబరిచాడు.
అన్న చెల్లెళ్ల బంధానికి ప్రతీరూపంగా నిలిచే మరో పాట గోరింటాకు సినిమాలోని ‘అన్నా చెల్లెల అనుబంధ’ పాట. ఈ పాట వింటే కచ్చితంగా కంటిలో నుంచి నీరు రాక మానదనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు.
మరిన్ని పాటలు..
Rakshabandhan 2021: వాట్సప్‌లో రాఖీ శుభాకాంక్షలు.. మీ ఫోటో స్టిక్కర్‌తో ఇలా పంపించండి..