Raksha Bandhan 2021: మీ సొదరులకు రాఖీ కట్టేప్పుడు ఈ విషయాలు మాత్రం అస్సలు మర్చిపోకూడదు.. ఎంటో తెలుసుకొండి..

రాఖీ పండుగ.. అన్న చెల్లెలకు, అక్క తమ్ముల్ల మధ్య ప్రేమను, ప్రాధాన్యతను తెలిపే ప్రత్యేకమైన రోజూ.. హిందూ మతంలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది.

Raksha Bandhan 2021: మీ సొదరులకు రాఖీ కట్టేప్పుడు ఈ విషయాలు మాత్రం అస్సలు మర్చిపోకూడదు.. ఎంటో తెలుసుకొండి..
Raksha Bandan
Follow us

|

Updated on: Aug 22, 2021 | 7:59 AM

రాఖీ పండుగ.. అన్న చెల్లెలకు, అక్క తమ్ముల్ల మధ్య ప్రేమను, ప్రాధాన్యతను తెలిపే ప్రత్యేకమైన రోజూ.. హిందూ మతంలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిన ఈ పండుగ జరుపుకుంటారు. ఈరోజున సోదరి తన సోదరులకు కట్టే రాఖీతో వారు జీవితాతంతం ఆమెకు తోడుగా, రక్షణగా నిలుస్తారు. అయితే రాఖీ పండగ రోజున తమ సోదరులకు రాఖీ కట్టే సమయంలో కొన్ని విషయాలను మాత్రం అస్సలు మర్చిపోకూడదు.. అవెంటో తెలుసుకుందామా.

కుంకుమ… రాఖీ కట్టడానికి ముందుగా తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ పండగ రోజున రాఖీ పెళ్లెంలో కుంకుమ తప్పనిసరిగా ఉండాలి. అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టవచ్చు.

బియ్యం.. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వేయడం ఆనవాయితి. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుడిని ఆశీర్వదీస్తూ అక్షింతలు వేయాలి. ఇవి కూడా రాఖీ పండుగ రోజున పూజా పళ్లెంలో ఉండాలి.

హారతి.. రాఖీ పండుగ రోజున తమ సోదరులకు రాఖీ కట్టిన తర్వాత ఆడపిల్లలు హారతి ఇస్తారు. అందుకే మీ పూజా పెళ్లెంలో చిన్న దీపం తప్పనిసరిగా ఉండాలి.

స్వీట్.. తమను రక్షించేందుకు ఎల్లవేళలా తమ తోడు ఉంటారని సోదరులకు రాఖీ కడతారు. అనంతరం జీవితంలోని కఠిన పరిస్థితులను ఎదుర్కోనేందుకు సూచికగా తమ సోదరులకు తీపిని తినిపిస్తారు. అందుకే తమ వారి కోసం మీ పూజా పళ్లెంలో స్వీట్స్ తప్పనిసరిగా ఉండాలి.

Also Read:  Tulasi Water: పరగడుపున తులసి నీరు తాగితే కడుపు నొప్పి తగ్గినట్లే.. అనారోగ్య సమస్యలు ఫసక్.. మరిన్ని లాభాలు..

Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. హైదరాబాద్‏లో 10 గ్రాముల సిల్వర్ రేట్ ఎంత ఉందంటే..

Naga Chaitanya: చైతూ కొత్త ప్రాజెక్ట్‏ అప్‏డేట్.. సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో నాగచైతన్య న్యూమూవీ..

Gold Price Today: మహిళలకు గుడ్‏న్యూస్.. రాఖీ పౌర్ణమి వేళ తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గిదంటే..