Naga Chaitanya: చైతూ కొత్త ప్రాజెక్ట్‏ అప్‏డేట్.. సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో నాగచైతన్య న్యూమూవీ..

కింగ్ నాగ్ వారసుడిగా చిత్రపరిశ్రమలోకి జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య.. ఇప్పుడు టాప్ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ..

Naga Chaitanya: చైతూ కొత్త ప్రాజెక్ట్‏ అప్‏డేట్.. సక్సెస్‏ఫుల్ డైరెక్టర్‏తో నాగచైతన్య న్యూమూవీ..
Nagachaitanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 22, 2021 | 6:46 AM

కింగ్ నాగ్ వారసుడిగా చిత్రపరిశ్రమలోకి జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య.. ఇప్పుడు టాప్ హీరోలలో ఒకరిగా దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ..బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ.. నూతన దర్శకులకు కూడా ఛాన్స్ ఇచ్చే పనిలో పడ్డాడు చైతూ.. ఇక ఇటీవల డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇందులో చైతూ సరసన సాయిపల్లవి హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో రికార్డ్స్ సృష్టించాయి. ఇక ఈ సినిమాతోపాటు.. నాగచైతన్య ప్రస్తుతం బాలీవుడ్‏లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే… తాజా సమాచారం ప్రకారం నాగచైతన్య మరో కొత్త ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రెండు మూడేళ్లు సీరియల్స్‌లో, ఆ తర్వాత సినిమాల్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్‌ కనకమేడల ‘నాంది’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా హిట్టు కోసం వెయిట్ చేస్తోన్న అల్లరి నరేష్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. తాజాగా ఈ డైరెక్టర్ నాగచైతన్యతో సినిమా చేయబోతున్నాడట. ఇప్పటికే చైతూకు విజయ్ స్టోరీ వినిపించాడని.. అ కథను నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చి్న్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. విజయ్ చెప్పిన స్టోరీ సమంతకు కూడా బాగా నచ్చిందని టాక్ వినిపిస్తోంది. త్వరలోని ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: Silver Price Today: తగ్గిన వెండి ధరలు.. హైదరాబాద్‏లో 10 గ్రాముల సిల్వర్ రేట్ ఎంత ఉందంటే..

Shruti Hassan: ఫుడ్‌, సెక్స్‌లో శృతీ హాసన్‌ ప్రాధాన్యత దేనికో తెలుసా.? ఆసక్తికర ముచ్చట్లు చెప్పుకొచ్చిన శృతీహాసన్‌.

Gold Price Today: మహిళలకు గుడ్‏న్యూస్.. రాఖీ పౌర్ణమి వేళ తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గిదంటే..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!