AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakshabandhan 2021: వాట్సప్‌లో రాఖీ శుభాకాంక్షలు.. మీ ఫోటో స్టిక్కర్‌తో ఇలా పంపించండి..

రాఖీ పండుగను వాట్సప్ తో మరింత సరదాగా జరుపుకోవచ్చు. వాట్సప్ మెసేజ్ లకు మీ శుభాకాంక్షల స్టిక్కర్లను జోడించడం ద్వారా మీ సోదరుడు/సోదరికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పండి.

Rakshabandhan 2021: వాట్సప్‌లో రాఖీ శుభాకాంక్షలు.. మీ ఫోటో స్టిక్కర్‌తో ఇలా పంపించండి..
Rakshabandhan 2021
KVD Varma
|

Updated on: Aug 22, 2021 | 7:10 AM

Share

Rakshabandhan 2021: రాఖీ పండుగను వాట్సప్ తో మరింత సరదాగా జరుపుకోవచ్చు. వాట్సప్ మెసేజ్ లకు మీ శుభాకాంక్షల స్టిక్కర్లను జోడించడం ద్వారా మీ సోదరుడు/సోదరికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పండి. ఈ రాఖీని మరింత గుర్తుండిపోయేలా చేసుకోండి. వాట్సాప్‌లో తమ పేర్లు లేదా ఫోటోలతో కూడిన స్టిక్కర్లను ఎలా తయారు చేస్తారో చాలామందికి తెలియదు. వినియోగదారు డిఫాల్ట్ స్టిక్కర్‌లో ఈ ఎంపికను పొందలేరు. ఇప్పుడు అటువంటి ప్రత్యేకమైన స్టిక్కర్లను వాట్సప్ కోసం ఎలా రూపొందిచుకోవాలో తెలుసుకుందాం.

వాట్సాప్ కోసం మీ స్వంత ఫేస్ ఎమోజీని తయారు చేసుకోండి ఇలా..

మీరు మీ ముఖం మరియు ముఖ కవళికతో ఎమోజిని తయారు చేయాలనుకుంటే, ఉచిత ఆండ్రాయిడ్ యాప్‌ల సహాయంతో చేసుకోవచ్చు. దీని కోసం, మీరు ప్లే స్టోర్‌లో ఎమోజి మేకర్ (emoji maker) అని వెతకండి. అనేక యాప్‌లు ఇక్కడకు వస్తాయి. మెరుగైన రేటింగ్..సమీక్షల ప్రకారం, మీరు ఏదైనా ఒక యాప్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఇప్పుడు యాప్‌లోని విభిన్న ఎక్స్‌ప్రెషన్‌లతో మీ ముఖం ఫోటోపై క్లిక్ చేయండి. తర్వాత యాప్ సహాయంతో వాటిని కార్టూన్ లాంటి ఎమోజీగా మార్చండి. ఫోన్‌లో ఫోటో ఫార్మాట్‌లో వాటిని సేవ్ చేయండి.

Rakhi App

Android Free Apps for Emoji Making

ఎమోజీ సిద్ధం చేసుకున్న తరువాత ఇలా..

ఇప్పుడు మీరు వాట్సప్ స్టిక్కర్ తయారు చేయడం కోసం బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్..పర్సనల్ స్టిక్కర్లు అనే 2 యాప్‌లను ఇన్‌స్టాల్ చేయాలి. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్‌లను ప్లే స్టోర్ నుండి ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

బ్యాక్‌గ్రౌండ్ ఎరేజర్ యాప్ సహాయంతో, మీరు ఫోటో నేపథ్యాన్ని తీసివేయవచ్చు. యాప్‌లో ఫోటోను కత్తిరించడంతో పాటు, దాన్ని తుడిచివేయడానికి ఒక ఎంపిక ఉంది. ఆటో, మాన్యువల్, మ్యాజిక్, రిపేర్ టూల్స్ సహాయంతో ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌ను సులభంగా తొలగించవచ్చు. ఫోటోను చెరిపివేసిన తర్వాత, దానిని PNG ఫార్మేట్ లో సేవ్ చేయండి.

మీరు యాప్‌లోని ఫోటో బ్యాక్‌గ్రౌండ్‌ని తొలగించలేకపోతే, ఫోటోషాప్ లేదా ఇతర సాఫ్ట్‌వేర్ సహాయంతో కంప్యూటర్‌లో దాన్ని తీసివేయవచ్చు. www.remove.bg వెబ్‌సైట్‌లో ఈ పని చాలా ఈజీగా చేయవచ్చు. సవరించిన ఫోటోను PNG ఫార్మేట్ లో సేవ్ చేయండి. ఈ విధంగా మీరు ఫోటో లేదా పేరుతో అనేక ఫోటోలను సేవ్ చేయవచ్చు. ఈ ఫోటోలు ఎమోజీగా పనిచేస్తాయి.

ఇప్పుడు వాట్సప్ యాప్ కోసం వ్యక్తిగత స్టిక్కర్లను తెరవండి. ఫోన్ యొక్క PNG ఫార్మాట్‌లో ఉన్న అన్ని ఫైల్‌లు ఇక్కడ చూపబడతాయి. మీ ఫోటోలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఈ ఫోటోల ముందు ADD ని ట్యాబ్ చేస్తే చాలు. దీని తర్వాత మీ ముందు ఒక చిన్న విండో కనిపిస్తుంది, దాన్ని మరోసారి జోడించండి. ఈ విధంగా మీరు సృష్టించిన ఎమోజి వాట్సప్ లోని స్టిక్కర్ లొకేషన్‌కు చేరుకుంటుంది.

ఎమోజిని పంపే ప్రక్రియ

1. వాట్సాప్‌ని తెరిచి, మీరు ఎమోజీని పంపాలనుకునే పేరును సెలెక్ట్ చేసుకోండి. 2. ఇప్పుడు టైపింగ్ స్పేస్ పక్కన ఇచ్చిన స్మైలీని ట్యాబ్ చేయండి. 3. ఇక్కడ మీరు దిగువన స్మైలీతో GIF అలాగే స్టిక్కర్ లోగో కనిపిస్తుంది. 4. స్టిక్కర్ లోగోపై ట్యాబ్ చేయండి.. అక్కడ కనిపించే జాబితా నుండి మీరు సృష్టించిన ఎమోజీని ఎంచుకోండి. 5. ఎమోజిపై ట్యాబ్ చేయండి అది మీ కాంటాక్ట్ కు జత అవుతుంది. ఇప్పుడు సెండ్ చేయండి.

అంతే..సరికొత్తగా మీ శుభాకంక్షల సందేశం అవతలి వారికి చేరిపోతుంది!

Also Read: Gmail Schedule Email: సెట్ చేసుకున్న సమయానికి మెయిల్‌ ఎలా పంపాలో తెలుసా.? ఈ ఫీచర్‌ గురించి తెలుసుకోవాల్సిందే.

సీఎం జగన్ కు రాఖీ కట్టిన వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని, విజయవాడ మేయర్, మహిళా ప్రజా ప్రతినిధులు ఫోటో గ్యాలెరీ