Rashmika Mandanna: ఇళ్లా.. ఇంద్రభవనమా.. రష్మిక ఇంటిని చూసేందుకు రెండు కళ్లు చాలవంతే..
2014లో కిరిక్ పార్టీ సినిమాతో కథానాయికగా కెరీర్ ఆరంభించిన రష్మిక.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ.

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నేషనల్ క్రష్ రష్మిక ఒకరు. అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని.. సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతుంది. ముఖ్యంగా డైరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీ ఎఫెక్ట్.. హిందీలోనూ వరుస అవకాశాలను అందుకుంటూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమా ప్రమోషన్లలో భాగంగా బన్నీతో కలిసి రష్యాలో సందడి చేస్తుంది. 2014లో కిరిక్ పార్టీ సినిమాతో కథానాయికగా కెరీర్ ఆరంభించిన రష్మిక.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ముద్దుగుమ్మ.
అయితే క్రేజ్ తో పాటు.. ఈ అమ్మడు ఆస్తులు కూడా భాగానే పెరిగినట్లుగా తెలుస్తోంది. దేశంలోని అనేక నగరాల్లో ఆమెకు సొంతంగా ఇళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ రష్మిక స్వగ్రామమైన కర్ణాటకలోని విరాజ్ పేట్ లో ఉన్న ఇంటిని ఎప్పుడైనా చూశారా. ఎప్పుడూ తన స్థానిక ఇంటిని ప్రేమిస్తానని.. అక్కడ ఆమెకు శాంతి, ఎంతో సౌకర్యాలు లభిస్తాయని పేర్కొంది. రష్మిక విలాసవంతమైన బంగ్లా చుట్టూ అందమైన గ్రీనరీ ఉంది. పర్వావరణాన్ని ప్రేమించడంలోనూ ఈ నేషనల్ క్రష్ ముందుంటుంది.




ప్రస్తుతం రష్మిక విజయ్ సరసన వరిసు సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరియు పివిపి సినిమాపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.