Tollywood : ప్రభాస్, ఎన్టీఆర్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్.. రజినీకాంత్కే చెమటలు పట్టించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
అందంలో అప్సరస.. నటనలో అత్యద్భుతం.. దక్షిణాదిలో స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఆమె. ఒకప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికలలో ఒకరిగా దూసుకుపోయింది. ఇప్పుడు సహయ నటిగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగు, తమిళం సహా మిగతా అన్ని భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అద్భుతమైన యాక్టింగ్.. చూపు తిప్పుకోనివ్వని అందంతో మెస్మరైజ్ చేసింది. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అటు కథానాయికగా నటిస్తూనే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే స్పెషల్ పాటలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో అధిక పాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ ఆమె. పైన ఫోటోను చూశారు కదా.. ఆ చిన్నారి నాట్యమయూరి ఎవరో గుర్తుపట్టారా.. ?
దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్ ఆమె. ఇప్పటివరకు దాదాపు 200కి పైగా చిత్ర్లాల్లో నటించింది. 90‘s లో సౌత్ ఇండస్ట్రీని ఏలిన తార. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అలాగే ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ల సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించారు. ఇప్పుడు సహయ నటిగా సెటిల్ అయ్యారు. ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ రమ్యకృష్ణ. బాహుబలి చిత్రంలో శివగామిగా గుర్తింపు పొందింది. 13 సంవత్సరాల వయసులో సినీరంగంలోకి అడుగుపెట్టారు. వెల్లై మనసు చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
1990 నుండి 2000 వరకు.. ఈ పదేళ్ల కాలంలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. సౌత్ ఇండస్ట్రీలోని అందరి హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ముఖ్యంగా నరసింహా సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ నే డామినేట్ చేసింది. అప్పట్లో రజినీకి పోటీగా నటించిన ఏకైక హీరోయిన్ రమ్యకృష్. నీలాంబరి పాత్రలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఇక ఇటీవల బాహుబలిలో శివగామి పాత్రతో పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..
