Actor Prabhu: డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తండ్రి.. ఈ నటుడి కొడుకు క్రేజీ హీరో.. తెలుగులో చాలా సినిమాల్లో..
సౌత్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభు. రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాతో పాపులర్ అయిన ఆయన.. ఆ తర్వాత డార్లింగ్ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెప్పించాడు. అలాగే తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

దక్షిణాదిలో ఎన్నో హిట్ చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభు. చంద్రముఖి సినిమాలో రజినీ స్నేహితుడిగా కనిపించి తెలుగు వారికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత డార్లింగ్ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి ఆకట్టుకున్నాడు.2008లో జగపతి బాబు నటించిన కథానాయకుడు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభు.. ఎక్కువగా డార్లింగ్ సినిమాతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నాడు. ఆరెంజ్, శక్తి, బెజవాడ, దరువు ఇలా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ప్రభు… తండ్రి ఒకప్పుడు తోపు హీరో. ఆయన పేరు శివాజీ గణేషన్. ఒకప్పుడు తమిళంలో టాప్ హీరోగా అనేక చిత్రాల్లో నటించాడు. తండ్రి బాటలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభు.. మొదట్లో హీరోగా పలు సినిమాలు చేశారు.ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యాడు.
ఇవి కూడా చదవండి : Venky Movie: వెంకీ సినిమాను మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ? రవితేజతో జోడి కట్టాల్సిన బ్యూటీ ఎవరంటే..
ఒకప్పుడు అనేక చిత్రాల్లో హీరోగా నటించిన ప్రభు… వైవిధ్యమైన పాత్రలతో మెప్పించి సహయ నటుడిగా సెటిల్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ప్రభు కొడుకు సైతం సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో అని మీకు తెలుసా.. ? అవును.. తెలుగు, తమిళంలోనూ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. అతడి పేరు విక్రమ్ ప్రభు. ఇటీవల తెలుగులో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఘాటి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దేసి రాజు పాత్రలో నటించి మెప్పించాడు.
ఇవి కూడా చదవండి : Kamal Haasan : ఆరేళ్ల వయసులోనే సినిమాల్లోకి.. ఒక్కో సినిమాకు రూ.150 కోట్లు.. కమల్ హాసన్ ఆస్తులు ఎంతో తెలుసా.. ?
విక్రమ్ ప్రభు.. 2012లో కుమ్మి సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇవాన్ వెరమాతిరి, వెల్లైకార దురై వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇప్పటివరకు వరుసగా తమిళ సినిమాల్లో నటించిన విక్రమ్ ప్రభు.. ఇప్పుడు ఘాటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Actress: ఒకప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్.. క్రేజ్ మాములుగా ఉండదు..




