AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken shops: చికెన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. మూతబడిన షాప్‌లు.. ఎందుకంటే!

తెలంగాణలోని మాంస ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు మూతబడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీల నుంచి వచ్చే మార్జిన్ తగ్గడంలో షాపులు నిర్వహించడం తమకు భారంగా మారుతుందని.. తద్వారా తాము నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని చికెన్ షాప్ యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్జిన్ ధరలు పెంచేంత వరకు ఈ చికెన్ షాపులు క్లోజ్‌లోనే ఉంటాయని రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.

Chicken shops: చికెన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. మూతబడిన షాప్‌లు.. ఎందుకంటే!
Telangana Chicken Bandh
Anand T
|

Updated on: Apr 01, 2026 | 10:48 AM

Share

చికెన్ తినే వారికి ఇదో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి చికెన్ షాపులు బంద్‌కు పిలుపునిచ్చిన తెలంగాణ చికెన్ షాప్స్ అసోసియేషన్. చికెన్ విక్రయాలలో మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ దుఖానాలను బంద్ చేసింది. మార్జిన్స్ పెంచకపోతే ఇవాళ్టి నుంచి షాపులు మూసివేస్తామని వారం కిందటే ప్రకటించింది. అనుకున్న ప్రకారమే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ షాప్‌లను బంద్ చేసింది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్‌‌ను రూ.26 నుంచి రూ.16కి తగ్గించడంతో ఖర్చులు పోగా కిలోకు రూ.5 నుంచి రూ.6 కూడా మిగలడం లేదని షాపు ఓనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షాపు రెంటు, కూలీల జీతాలు, కరెంటు బిల్లు అమ్ముడుపోని చికెన్ కారణంగా నష్టపోతున్నామని అంటున్నారు. పౌల్ట్రీ కంపెనీలు దిగివచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఇప్పటకే తెలంగాణ చికెన్ షాప్స్ అసోసియేషన్ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,500 చికెన్ షాపులు మూత పడ్డాయి. అటు నాగర్ కర్నూల్ జిల్లాలో చికెన్‌ దుకాణాలు బంద్‌ చేసిన దుకాణాలదారులు నిరనసన తెలుపుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 50వేలకి పైగా చికెన్‌ షాప్‌లు ఉండగా.. ఒక్క హైదరాబాద్‌లోనే 25 వేల వరకూ షాప్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం షాపుల నుంచే రోజూ 18 నుంచి 20 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ మూత బడడంతో భారీ మొత్తంలో చినెన్ నిల్వలు మిగిలిపోనున్నాయి.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us