AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జేసీబీతో పొలంలో తవ్వకాలు జరుపుతుండగా.. బరువుగా తగిలిన కుండ.. బద్దలుకొట్టి చూడగా

పొలం పనులు చేస్తుండగా రైతుకు ఓ కుండ బయటపడింది. అది బద్దలు కొట్టి చూడగా.. అందులో ఏవో కొన్ని నాణేలు ఉన్నాయి. అయితే ఇక్కడే కొన్ని పంపకాల మధ్య తేడా రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Telangana: జేసీబీతో పొలంలో తవ్వకాలు జరుపుతుండగా.. బరువుగా తగిలిన కుండ.. బద్దలుకొట్టి చూడగా
Representative Image
N Narayana Rao
| Edited By: |

Updated on: Apr 01, 2026 | 10:11 AM

Share

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అశ్వాపురం మండలం బిజీ కొత్తూరులో పొలం చదును చేసే పనిలో భాగంగా ఓరైతు జేసిబితో తవ్వకాలు జరుపుతుండగా ఒక పురాతన మట్టి కుండ బయటపడింది. ఆ కుండలో సుమారు 70 పురాతన నాణేలు ఉండటం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. పొలం పనులు చేస్తున్న సమయంలో కుండ బయటపడగానే అక్కడ ఉన్న ట్రాక్టర్ డ్రైవర్లు నాణేలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. అయితే నాణేల పంపకాల విషయంలో వారి మధ్య తలెత్తిన వివాదం కారణంగా పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది.

ఇది చదవండి: ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎన్ని రోజుల వరకు పూజలు చేయకూడదంటే.?

ఇదే క్రమంలో ఓ వ్యక్తి దగ్గర ఉన్న రెండు నాణేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసుల విచారణలో ఈ నాణేలు రాగితో తయారు చేయబడినట్లుగా గుర్తించారు. ఈ నాణేలు 14వ శతాబ్దానికి చెందిన బహుమనీ సుల్తానుల కాలానికి చెందినవిగా నిర్ధారించారు. పురాతన చరిత్రకు సంబంధించిన ఈ విలువైన నాణేలు బయటపడటం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు ఈ నాణేలను సంబంధిత పురావస్తు శాఖకు అప్పగించే ప్రక్రియలో ఉన్నారు. గతంలో కూడా బిజీ కొత్తూరు ప్రాంతంలో కొందరికి బంగారు నాణేలు దొరికినట్లుగా చెప్తున్నారు స్థానికులు. సంబంధిత పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తవ్వకాలు జరిపితే మరింత సమాచారం బయటపడే అవకాశం ఉంటుందంటున్నారు చరిత్రకారులు.

ఇది చదవండి: ఇలా చేస్తే దోసెలు పెనానికి జన్మలో కూడా అతుక్కోవు.. ఎలాగో మీరూ చూడండి

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా