ఘోర ప్రమాదం.. కొండను ఢీకొట్టి కుప్పకూలిన యుద్ధ విమానం.. 29 మంది మృతి..!
రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. రక్షణ శాఖకు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం (ఏప్రిల్ 1, 2026) రోజు తెల్లవారుజామున రష్యా సైనిక విమానం కూలిపోవడంతో 29 మంది మరణించారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. క్రిమియాలో రష్యా సైనిక ఏఎన్-26 రవాణా విమానం కూలిపోయిందన్నారు.

రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. రక్షణ శాఖకు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం (ఏప్రిల్ 1, 2026) రోజు తెల్లవారుజామున రష్యా సైనిక విమానం కూలిపోవడంతో 29 మంది మరణించారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. క్రిమియాలో రష్యా సైనిక ఏఎన్-26 రవాణా విమానం కూలిపోయిందన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.
టాస్ వార్తా సంస్థ కథనం ప్రకారం, ఆ విమానం ఒక కొండను ఢీకొట్టింది. జిన్హువా వార్తా సంస్థ, మంగళవారం రాత్రి పొద్దుపోయాక విమానం క్రిమియా ద్వీపకల్పం మీదుగా షెడ్యూల్ ప్రకారం ప్రయాణిస్తుండగా దానితో సంబంధాలు తెగిపోయాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ప్రమాదం సాంకేతిక లోపం వల్ల జరిగిందని, విమానాన్ని ఏదీ ఢీకొనలేదని తెలుస్తోంది.
“మార్చి 31వ తేదీన, మాస్కో కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో, క్రిమియా ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న ఏఎన్-26 విమానంతో సంబంధాలు తెగిపోయాయి” అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అనంతరం గాలింపు, సహాయక బృందాలు ప్రమాద స్థలాన్ని గుర్తించాయి. విమానంలో ఉన్న ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులు మరణించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
విమానంలో ఎంతమంది ఉన్నారో నివేదికలో స్పష్టంగా పేర్కొనలేదు, కానీ ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని తెలిసింది. ఏఎన్-26 అనేది దశాబ్దాలుగా వాడుకలో ఉన్న ఒక తేలికపాటి సైనిక రవాణా విమానం. ఇది తక్కువ, మధ్యస్థ దూరాలకు సుమారు 40 మంది ప్రయాణికులను, సరుకును తీసుకువెళ్లగలదు.
గత సంవత్సరం డిసెంబర్‌లో రష్యా ఒక పెద్ద సైనిక విమాన ప్రమాదాన్ని చవిచూసింది . డిసెంబర్ 9న, మాస్కోకు తూర్పున ఉన్న ఇవనోవో ప్రాంతంలోని ఇవనోవో గ్రామం సమీపంలో ఒక పరీక్షా విమానయానం సందర్భంగా ఆంటోనోవ్ ఆన్-22 విమానం కూలిపోయింది. మరమ్మతు పనుల తర్వాత ఆ విమానం ప్రయాణిస్తుండగా కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో అది మరమ్మతుల అనంతర పరీక్షిస్తుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో కూడా ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. విమానంలో ఉన్న వారి సంఖ్యను మొదట్లో వెల్లడించనప్పటికీ, ఏడుగురు సిబ్బంది ఉండగా, వారందరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రష్యన్ సైనిక విమానయాన రంగానికి తీరని నష్టం కలిగించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
