ఏప్రిల్ ఫూల్.. ఈ డే ఎందుకు జరుపుకుంటారు? దీని కథ తెలుసా?
Samatha
1 April 2026
ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు. ప్రతి ఒక్కరూ ఏప్రిల్ ఫూల్ అంటూ, సరదాగా ఏప్రిల్ ఫూల్ డే జరుపుకుంటారు.
ఏప్రిల్ 1
అయితే అసలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఫూల్ డే ఎందుకు జరుపుకుంటారు. దీని వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
అసలు కథ
ఈ ఏప్రిల్ ఫూల్ డే వెనుక అనేక కథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది 1582 సంవత్సరంలో ఫ్రాన్స్ క్యాలెండర్ మార్పు అనేది చాలా సంఘటన
1582
ఈ సమయంలో పోప్ గ్రెగోరీ Xlll ఆదేశాల మేరకు ఫ్రాన్స్ జూలియన్ క్యాలెండర్ నుంచి గ్రెగొరీ క్యాలెండర్‌కు మారింది. అంతక ముందు మార్చి చివరన, ఏప్రిల్ 1 ముగిసే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, జనవరి 1కి మారాయి.
న్యూఇయర్ సెలబ్రేషన్స్
అయితే అప్పుడు చాలా మంది పాత పద్ధతులనే అనుసరించాలనే నెపంతో ఏప్రిల్ 1న న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేవారంట, దీంతో కొత్త క్యాలెండర్ పాటించని వారి మిగితా వారు ఎగతాళి చేస్తూ ఏప్రిల్ ఫూల్స్ అని పిలిచేవారంట, ఆటపట్టించేవారంట.
ఏప్రిల్ ఫూల్
కాల క్రమేణా ఇది ఏప్రిల్ ఫూల్స్ డే గా మారింది. అలా అప్పటి నుంచి మనం ఏప్రిల్ 1ని ఏప్రిల్ ఫూల్స్ డేగా జరుపుకుంటున్నాం అంటారు కొందరు.
ఫూల్స్ డే
మరి కొంత మంది, ప్రాచీన రోమన్లు మార్చి చివరన హిలారియా పండుగను జరుపుకునే వారు ఈ రోజు ఒకరిని ఒకరు ఆట పట్టించుకునేవారు.
హిలారియా
అయితే రాను రాను ఈ వేడుకలే, ఏప్రిల్ ఫూల్స్ డేకి పునాది అయ్యాయి. ఈ కారణంగా ఏప్రిల్ ఫూల్ డే జరుపుకుంటారు అని తెలియజేయడం జరిగింది.