Pakistan: చమురు, గ్యాస్ అక్రమ నిల్వ, దొంగిలిస్తే తీవ్రవాదులతో సమానం.. చట్టం చేసిన సర్కార్!
చమురు, గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. చమురు, గ్యాస్‌లను అక్రమంగా నిల్వ చేయడం, దొంగిలించడాన్ని తీవ్రవాదంగా వర్గీకరించారు. ఇందుకు సంబంధించిన ఒక బిల్లును సోమవారం (మార్చి 30) జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందితే, పాకిస్తాన్‌లో చమురు, గ్యాస్‌లను నిల్వ చేయడం, అక్రమంగా రవాణా చేయడం, చట్టవిరుద్ధంగా భద్రపరచడం నేరంగా పరిగణిస్తారు.

చమురు, గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. చమురు, గ్యాస్‌లను అక్రమంగా నిల్వ చేయడం, దొంగిలించడాన్ని తీవ్రవాదంగా వర్గీకరించారు. ఇందుకు సంబంధించిన ఒక బిల్లును సోమవారం (మార్చి 30) జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందితే, పాకిస్తాన్‌లో చమురు, గ్యాస్‌లను నిల్వ చేయడం, అక్రమంగా రవాణా చేయడం, చట్టవిరుద్ధంగా భద్రపరచడం నేరంగా పరిగణిస్తారు. ప్రభుత్వం కోరుకుంటే, ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తిపై తీవ్రవాద చట్టాన్ని కూడా విధించవచ్చు.
డాన్ వార్తాపత్రిక కథనం ప్రకారం, పాకిస్తానీ ప్రభుత్వం పార్లమెంటులో క్రిమినల్ లా (సవరణ) బిల్లు, 2026ను ప్రవేశపెట్టింది. చమురు, గ్యాస్ సంక్షోభానికి ప్రతిస్పందనగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మాఫియా కుమ్మక్కుతో చమురు సంస్థలపై దాడులు జరుగుతున్నాయని, ఆ తర్వాత చమురును నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈమేరకు పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి అజం నజీర్ తారర్ ఈ బిల్లును ప్రవేశపెట్టిన తెలుస్తోంది.
ఉగ్రవాదులు మొదట పైప్‌లైన్‌లను ధ్వంసం చేసి, ఆ తర్వాత మాఫియాల ద్వారా చమురు, గ్యాస్‌లను అమ్ముతున్నారని పాకిస్తానీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ డబ్బును పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి ఉపయోగిస్తున్నారు. అందుకే పాకిస్తానీ ప్రభుత్వం చమురు, గ్యాస్‌కు సంబంధించి కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు డాన్ పత్రిక పేర్కొంది. ఇదిలావుంటే, సోమవారం, బలూచిస్థాన్‌లోని ఒక చమురు పైప్‌లైన్‌పై దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీనివల్ల బలూచ్ రాజధాని క్వెట్టాతో సహా పలు ప్రాంతాలకు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ దాడులను ఎవరు, ఎందుకు చేశారనే దానిపై ప్రభుత్వం ఎలాంటి సమాచారం అందించలేదు.
పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి అజం నజీర్ తారర్ ప్రవేశపెట్టిన ఈ బిల్లులో ముఖ్యాంశాలు
- చమురు లేదా గ్యాస్ దొంగిలిస్తూ పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేరానికి 14 సంవత్సరాల వరకు కారాగార శిక్ష, జైలు శిక్షతోపాటు రూ. 3 కోట్ల వరకు జరిమానా విధించనున్నారు.
- చమురు లేదా గ్యాస్‌ను అక్రమంగా రవాణా చేసినా లేదా నిల్వ చేసినా ఎవరికైనా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు. పెట్రోలియం పైప్‌లైన్‌పై దాడి చేసినా వారిపై కఠినమైన శిక్షలు ఉంటాయి.
- కొత్త చట్టం ప్రకారం, చమురు, గ్యాస్ కేసులో నిందితుడైన వ్యక్తిని అరెస్టు చేయడానికి వారెంట్ అవసరం లేదు. అధికారులు ఆ వ్యక్తిపై సుమోటోగా చర్య తీసుకోవచ్చు.
- పాకిస్తాన్‌లో ఉగ్రవాదులను కూడా అదే విధంగా చూస్తారు. ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టు చేయడానికి వారెంట్ అవసరం లేదు. ఉగ్రవాదులకు కనీసం 14 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
