AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనిల్ రావిపూడి సినిమాలో కృతిశెట్టి, కీర్తి సురేష్?

అనిల్ రావిపూడి సినిమాలో కృతిశెట్టి, కీర్తి సురేష్?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 30, 2026 | 10:39 PM

Share

అనిల్ రావిపూడి విజయాల పరంపర కొనసాగుతోంది. వచ్చే సంక్రాంతికి వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో ఆయన దర్శకత్వంలో రాబోయే చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి నాయికలుగా నటించనున్నట్లు వార్తలున్నాయి. ఇద్దరు కథానాయికలకు కూడా ఇప్పుడు హిట్ అవసరం. అనిల్ రావిపూడి తన గత చిత్రాలతో హీరోయిన్లకు హిట్స్ అందించిన అనుభవం ఉంది. ఈ కొత్త ప్రాజెక్ట్ వారి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ కావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

అడుగులు ముందుకు పడుతున్నప్పుడు సొసైటీలో నలుగురూ నాలుగు మాటలు అంటూ ఉంటారు. ఎంత వద్దనుకున్నా కొన్నిసార్లు ఆ మాటల ప్రభావం మనసుపై పడుతుంది. ఆ ఇన్‌ఫ్లుయన్స్ కొంత జోష్‌నీ ఇస్తుంది. మరికొన్నిసార్లు డేర్‌ చేయమనీ ప్రోత్సహిస్తుంది. సెల్ఫ్‌ ఛాలెంజులకు సై అనమంటుంది. ఇప్పుడు అనిల్‌ రావిపూడి అలాంటి డేరింగ్‌ స్టెప్‌ తీసుకుంటున్నారా? మన శంకర వరప్రసాద్‌గారు హిట్‌ కావడంతో ఇక అనిల్‌ రావిపూడికి తిరుగులేదనే విషయాన్ని ఇష్టంగా చెప్పుకుంటున్నారు మూవీ లవర్స్. ఆడియన్స్ పల్స్ తెలిసిన హిట్‌ మిషన్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా విక్టరీ హీరో వెంకటేష్‌తో మళ్లీ మేజిక్‌ రిపీట్‌ చేయడానికి రెడీ అవుతున్నారు అనిల్‌. అనిల్‌ డైరక్షన్‌లో వెంకటేష్‌, కల్యాణ్‌ రామ్‌ కలిసి నటించే సినిమా కోసం హీరోయిన్ల ఎంపిక జరుగుతోంది. ఆల్రెడీ కీర్తీ సురేష్‌ పేరు ఎప్పటి నుంచో ట్రెండ్‌ అవుతోంది. వెంకటేష్‌కి జోడీగా కీర్తీ నటిస్తారన్నది వార్తల సారాంశం. కల్యాణ్‌ రామ్‌తో జోడీ కట్టే నాయిక ఎవరనే చర్చలు కూడా సాగుతున్నాయి. ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని అనిల్‌ కన్సిడర్‌ చేస్తున్నారట అన్నది ఫిల్మ్ నగర్‌ న్యూస్‌. ఉప్పెన తర్వాత తెలుగులో ఆ రేంజ్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నారు కృతి శెట్టి. కీర్తీ సురేష్‌, కృతి శెట్టి.. ఇద్దరికీ ఇప్పుడు అర్జంటుగా హిట్‌ కావాలి. ఆ హిట్‌ అనిల్‌ రావిపూడి మూవీతో సాధ్యమవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది జనాల్లో. గోదారి గట్టుమీద అంటూ ఐశ్వర్య రాజేష్‌కీ, మీనూ మీనూ అంటూ మీనాక్షి చౌదరికి, మీసాల పిల్ల అంటూ నయన్‌కీ సాలిడ్‌ హిట్స్ ఇచ్చిన అనిల్‌… కీర్తి, కృతి బాధ్యతను తీసుకోవడంలో నిజానిజాలేంటో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వెయిట్‌ చేయాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉస్మానియా బిస్కెట్లు ఇష్టంగా తింటున్నారా.. ఇది చూడండి

తండ్రికి ప్రేమగా మిల్క్‌ షేక్‌ అందించి.. అనంత లోకాలకి పంపిన కుమార్తె..

ఇంటి ఆడపడుచులా.. గోమాతకు సీమంతం !!

చిన్న తప్పుతో నడవలేని స్థితికి చేరుకున్న.. హృతిక్‌ ప్రియురాలు

నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి కానీ.. ఇలా చేస్తారా ??

Published on: Mar 30, 2026 10:35 PM
Follow Us